Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-06-2018 - మంగళవారం మీ రాశి ఫలితాలు.. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా?

మేషం: సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యంలో చికాకులు తప్పవు. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్క

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (09:19 IST)
మేషం: సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యంలో చికాకులు తప్పవు. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు.
 
వృషభం: ఏదైనా అమ్మకానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మిధునం: వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులుండవు. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వసతి ఏర్పాట్లు విషయంలో చికాకులు ఎదురవుతాయి. సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవంపొందుతారు. రాజకీయ రంగాలవారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం: వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొరవఉండదు. సోదరీసోదరుల మధ్య అనుబంధాలు బలపడుతాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
సింహం: స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. ఎవరికైనా ధన సహాయంచేసినా తిరిగిరాజాలదు. మీలోని బలహీనతను తొలగించుకోవటం పై దృష్టి పెడుతారు. విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా దీటుగా ఎదుర్కుంటారు.
 
కన్య: వస్త్ర, బంగారు, వెండి లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. చిన్నపాటి ఆనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలు అందరి యందు కలుపుగోలు తనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పాత మెుండి బాకీలు వసూలవుతాయి.
 
తుల: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి. గృహ మార్పులు చేర్పుల వాయిదాపడుతాయి. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్ రంగాలవారికి సదవకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం: గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. డాక్టర్లు, శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతారు. 
 
ధనస్సు: స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రముఖుల ఇంటర్య్వూకోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఎ.సి. కూలర్ మెకానిక్ రంగాలవారికి సంతృప్తి కానవస్తుంది.
 
మకరం: ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థిక అవసరాలకు అందివస్తారు. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పోస్టల్, కొరియల్ రంగాలవారికి ఒత్తిడి తప్పదు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 
కుంభం: బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. రిప్రజెంటివ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకులు వంటివి తప్పవు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాందీ పలుకుతాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకోవలసి వస్తుంది. 
 
మీనం: మిర్చి, నూనె, పసుపు, చింతపండు స్టాకిస్టులకు, రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ నుండి ధన, వస్తు సహాయం ఆశించవచ్చును. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వాతావరణంలోని మార్పు రైతులలో ఆందోళన కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments