Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుక్రవారం (15-06-2018) దినఫలాలు .. పనులు పట్టుదలతో...

మేషం: కాంట్రాక్టర్లకు చేపట్టిన పని ముగింపు దశకు చేరుకుంటుంది. ప్రేమికుల మధ్య అవగాహనలోపం. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. కోర్టు వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. రాజకీయ, కళారంగ

Advertiesment
శుక్రవారం (15-06-2018) దినఫలాలు .. పనులు పట్టుదలతో...
, శుక్రవారం, 15 జూన్ 2018 (08:38 IST)
మేషం: కాంట్రాక్టర్లకు చేపట్టిన పని ముగింపు దశకు చేరుకుంటుంది. ప్రేమికుల మధ్య అవగాహనలోపం. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. కోర్టు వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు, బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు.
 
వృషభం: ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడక తప్పదు. ప్రముఖుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది. మిర్చి, నూనె, వెల్లుల్లి, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది.
 
మిధునం: ఆర్థికపరమైన సమావేశాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలు చేతి వృత్తుల యందు బాగా రాణిస్తారు. వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. స్త్రీలకు భేషజాలకు, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కర్కాటకం: వృత్తి వ్యాపారాల యందు అనుకూలత. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. స్త్రీల తొందరపాటుతనం వల్ల బంధువర్గాల నుండి మాటపడవలసివస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. కొత్త పరిచయాల వల్ల లబ్ది పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
 
సింహం: అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. స్త్రీలు భేషజాలకు, ప్రలోభాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది. రాబడి బాగున్నా ఆర్థిక సంతృప్తి అంతగాఉండదు.
 
కన్య: ఆర్థిక విషయాల్లో ప్రోత్సహారకరంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వడ్డీలు, డిపాజిట్లు అందుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. భాగస్వామిక జాయింటు వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
తుల: ఉద్యోగస్తులకు పై అధికారుల వలన ఇబ్బందులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. పూర్వ మిత్రులకలయికతో మానసికంగా కుదుటపడుతారు. ప్రయాణాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఖర్చులు మీ ఆదాయానికి తగినట్లుగానే ఉంటాయి. స్త్రీలు సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
 
వృశ్చికం: చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రుణ యత్నాలకు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు అనుకూలించవు. ప్రైవేటు విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు గుర్తింపు, తగిన అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం.
 
ధనస్సు: ప్రకటనలు, రవాణా, హోటల్, వ్యవసాయం, బోధన, కళాసాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి మెుహమ్మాటాలు ఎదుర్కుంటారు. 
 
మకరం: ఉపాధ్యాయులకు నూతన వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. నిత్యావసర వస్తువ్యాపారులకు పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అన్ని వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడగలవు. 
 
కుంభం: ఉద్యోగస్తులు కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మీ కార్యక్రమాలు పనులు వాయిదా పడుతాయి. ఆపద సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. రావలసిన బాకీలు సకాలంలో అందిన ధనం ఏమాత్రం నిల్వచేయలేరు. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. 
 
మీనం: పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. విద్యుత్, ఎ.సి. కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. రావలసిన మెుండి బాకీలు సైతం వసూలు కాగలవు. బంధుమిత్రు నుంచి ఒత్తిడి, మెుహమ్మాటాలు ఎదుర్కుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెగటివ్ ఎనర్జీ పారిపోవాలంటే.. ఉప్పు-నీరు చాలు..