Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుధవారం (13-06-2018) - ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా...

మేషం: రాజకీయాలలో వారికి సంఘంలో స్థాయి పెరుగగలదు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బరువు బాధ్యతలు అధికమవుతాయి. తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. తాపి పనివారికి లాభదాయకంగా ఉంటు

Advertiesment
బుధవారం (13-06-2018) -  ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా...
, బుధవారం, 13 జూన్ 2018 (07:52 IST)
మేషం: రాజకీయాలలో వారికి సంఘంలో స్థాయి పెరుగగలదు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బరువు బాధ్యతలు అధికమవుతాయి. తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. తాపి పనివారికి లాభదాయకంగా ఉంటుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
వృషభం: వస్త్ర, బంగారం, వెండిరంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాచరాస్తుల వ్యవహారంలో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలు ముఖ్యమై కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలక్ట్రానికి, కంప్యూటర్ రంగాలవారికి కలిసివచ్చేకాలం. ఉద్యోగస్తులు మార్పుకై చేయు ప్రయత్నాలలో జయం చేకూరుతుంది.
 
మిధునం: స్త్రీలకు చుట్టుపక్కలవారి నుండి వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందువెనుకలుగానైనా పూర్తితవుదుతుంది. మీ వాహనం ఇతరులకివ్వటం వల్ల కొత్త సమస్యలెదుర్కోవలసి వస్తుంది. 
 
కర్కాటకం: మామిడి, కొబ్బరి వ్యాపారులకు కలసివచ్చేకాలం. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు కలసివచ్చేకాలం. పౌరహితులకు వృత్తులలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. రావలసిన బాకీలు వాయిదా పడుటవలన ఆందోళన చెందుతారు. భాగస్వామ్యుల మధ్య అవరోధాలు తలెత్తిన నెమ్మదిగా పరిష్కరిస్తారు. 
 
సింహం: ఆర్ధికపరిస్థితి కొంత మెరుగుపడుతుంది. పీచు, ఫోమ్, లెదర వ్యాపారస్తులకు పురోభివృద్ధి. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. సంగీత, సాహిత్య సదస్సులలో పాల్గొంటారు. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ది పొందటానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త వహించండి.
 
కన్య: వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. శ్రమపడ్డా ఫలితం దక్కించుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆస్థి వివాదాల నుంచి బయటపడుతారు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యులకోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
తుల: కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన సమయం. రియల్‌ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి చికాకులు తప్పవు. కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి సమాయత్తమౌతారు. మీ ప్రత్యర్ధుల తీరును గమనించి ముందుకు సాగటం మంచిది.
 
వృశ్చికం: ఉమ్మడి కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది. చల్లని పానీయాల పట్ల ఆసక్తి చూపుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. రాడకీయాలలోనివారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి వస్తుంది. 
 
ధనస్సు: ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలవారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకు తప్పవు. పెద్దలతో వాదోపవాదాలకు దిగవద్దు. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్న చిన్ని విషయాలపై కూడా శ్రద్ధ పెట్టండి. పెట్టుబడులలో నిదానం అవసరం.
 
మకరం: కొంతమంది మిమ్ములను ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. విద్యుత్, ఎ.సి. కూలర్, మెకానికల్ రంగాలలోనివారికి సంతృప్తి కానవస్తుంది. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఐరన్, సిమెంట్, ఇసుక, కలప, ఇటుక వ్యాపారులకు అభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది.
 
కుంభం: కుటుంబ సమస్యలు, ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. సేవా కార్యక్రమాలపై ఆశక్తి పెరుగుతుంది. ప్రముఖుల సలహాలతో ముందుకు సాగుతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. విలువైన వస్తువులను సేకరిస్తారు.
 
మీనం: స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు. కిరణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. పాత సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. ఏదైనా అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది. బ్యాకింగ్ రంగాలవారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి... ఫలితం ఏంటి?