Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-03-2019 మంగళవారం దినఫలాలు - కర్కాటక రాశివారికి ఇలా ఉంటుంది..

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (08:55 IST)
మేషం: నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వలన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ ఆలోచనలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి. దంపతుల మధ్య అనేక విషయాలు చర్చకు వస్తాయి.
 
వృషభం: వస్త్ర, బంగారం, వెండి రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం మంచిది. బంధుమిత్రులకోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
మిధునం: బ్యాంకు పనులలో ఏకాగ్రత అవసరం. మీ పనులు, కార్యక్రమాల అనుకున్న విధంగా పూర్తికాగలవు. వాహనం నిదానంగా నడపడం మంచిది. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరవుతారు. దుబారా ఖర్చులు అధికం. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి.
 
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు చక్కగా పరిష్కరిస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, ఏకాగ్రత అవసరం. వేడుకలు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. ఆపద సమయంలో బంధువులు తప్పుకుంటారు. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా సాగుతాయి. అవివాహితులు శుభవార్తలు వింటారు.
 
సింహం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత అవసరం. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు.
 
కన్య: రాజకీయ రంగాల్లో వారికి అరచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. బిల్లులు చెల్లిస్తారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు వాయిదా పడుతాయి. వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనిఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులరాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. 
 
తుల: దంపతుల మధ్య కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటాయి. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు పూర్తికాగలవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
వృశ్చికం: విద్యార్థులలో ఏకాగ్రత అవసరం. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తికావు. సిమెంటు, ఐరన్, కలప రంగాల్లో వారికి కలిసిరాగలదు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధువులు మీ నుండి ధనసహాయం అర్థిస్తారు. పూర్తిగా కాక కొంత ధనసహాయం చేసి బంధుత్వం నిలుపుకోండి. 
 
ధనస్సు: విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులకు వచ్చిన అవకాన్ని జారవిడుచుకోవడం మంచిదికాదు. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. జాగ్రత్త వహించండి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. 
 
మకరం: విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. రాజకీయాల్లో వారికి ప్రతిపక్షాల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. దుబారా ఖర్చులు అధికం. కొత్త కొత్త ఆలోచనలు, పథకాలు రూపొందిస్తారు. కాంట్రాక్టు, ఇంజనీరింగ్ రంగాల్లోవారికి శుభదాయకం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.
 
కుంభం: ప్రభుత్వ కార్యాలయంలో పనులు సకాలంలో పూర్తికావు. ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మీనం: విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయాన యత్నాలలో సఫలీకృతులౌతారు. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. రాబడికి మించిన ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

తర్వాతి కథనం
Show comments