Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-03-2019 శుక్రవారం దినఫలాలు - మేష రాశివారికి ధన సహాయం చేస్తే...

Advertiesment
15-03-2019 శుక్రవారం దినఫలాలు - మేష రాశివారికి ధన సహాయం చేస్తే...
, శుక్రవారం, 15 మార్చి 2019 (09:06 IST)
మేషం: దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు జాగ్రత్త వహించండి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ వహించండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉన్నతికి నాందీ పలుకుతాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
వృషభం: మీ ఆంతరంగిక విషయాలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి  బాకీల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాహనం అమర్చుకుంటారు.
 
మిధునం: ఆర్థిక కుటుంబ విషయాల పట్ల దృష్టి సాగిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణదాతలను మంచి మాటలతో సంతృప్తిపరచడం శ్రేయస్కరం. స్త్రీలు వీలైనంత వరకు మితంగా సంభాషించడం మేలు. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ధనవ్యయం చెల్లింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. బంధువులతో తెగిపోయిన సంబంధబాంధవ్యాలు బలపడుతాయి. ఉద్యోగస్తులు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్‌లు యత్నాలను గుట్టుగా సాగించాలి. కష్టం మీకు ప్రతిఫలం మరోకరికి దక్కుతుంది.
 
సింహం: మీ సంతానం కోసం భవిష్యత్తుకోసం పొదుపు పథకాలు చేపడతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.
 
కన్య: బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి శ్రమ అధికమవుతుంది. ఇతరులకు వాహనం ఇవ్వడం వలన సమస్యలు తలెత్తుతాయి. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేవివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల: ఆర్థికపరమైన చర్చలు, సమావేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. చిన్నారుల, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదవకాశాలు లభించగలవు. సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
వృశ్చికం: వ్యాపారులకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. అనుబంధాలు బలపడుతాయి. విదేశీ వస్తువులు సేకరిస్తారు. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఖర్చులు అధికమైనా భారం అనిపించవు. 
 
ధనస్సు: ముఖ్యుల రాకపోకలు పెరుగుతాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. తెలివి తేటలతో వ్యవహరించడం వలన కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.  
 
మకరం: ఆర్థిక సంతృప్తి కానరాదు. దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్పురిస్తాయి. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం రాకపోవచ్చు.
 
కుంభం: చిన్నారుల మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితుల మధ్య దాపరికాలు సరికాదని గ్రహించాలి. పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టసాధ్యం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
 
మీనం: రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువులకు ధన సహాయం చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకుంఠవాసుడు శ్రీవేంకటేశ్వరుడిగా ఎందుకు వెలిశాడు?