Webdunia - Bharat's app for daily news and videos

Install App

13-04-2019 - శనివారం మీ రాశిఫలితాలు - సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం...

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (09:37 IST)
మేషం: ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. స్త్రీలతో మితంగా సంభాషించండి. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
వృషభం: ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. ధైర్యంగా ముందుకు పోగలరు. మీ మాటతీరు, మన్ననలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రముఖుల కలయిక అనుకూలించినా ప్రయోజనం ఉండదు. వాహన చోదకులకు అప్రమత్తత అవసరం.
 
మిధునం: వృత్తుల వారికి సామాన్యం. క్రయవిక్రయాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు. ఖర్చులు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం బలపడుతుంది. స్త్రీలు అయిన వారి నుండి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు.
 
కర్కాటకం: నోటీసులు, రశీదులు అందుకుంటారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారినుండి అభ్యంతరాలెదురవుతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
 
సింహం: టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానికి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సన్నిహితుల నుండి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. గృహంలో మార్పులు, చేర్పులకు వాయిదా పడుతాయి. పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
 
కన్య: స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. కుటుంబ సభ్యులు, వ్యాపార లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. మొండిబాకీలు వసూలవుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. 
 
తుల: సోదరీసోదరుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. తోటల రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.
 
వృశ్చికం: మీడియా రంగాలవారికి ఒత్తిడి, చికాకులు అధికం. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. రాజకీయనాయకుల కదలికలపై విద్రోహులుకన్నేసిన విషయం గమనించండి. ఆత్మీయులు, కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు.  
 
ధనస్సు: మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగును. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. పాత వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మంచికి పోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కుంటారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
 
మకరం: ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఇతరులు మీ నుండి ఏం కోరుకుంటున్నారో ముందు తెలుసుకోండి. మీ మాటతీరు వాక్‌చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కిరణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపార రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. అనుకున్న పనులు వాయిదాపడుతాయి. 
 
కుంభం: ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన గృహం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రీడల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగును. పనిచేసే చోట కొన్ని మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు షాపింగ్‍‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. సోదరీసోదరులతో అవగాహన కుదరదు. 
 
మీనం: బ్యాంకులు, లావాదేవీలకు అనుకూలం. పారిశ్రామిక రంగాల వారికి అన్నివిధాలా ప్రోత్సాహకరం. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. పారిశ్రామిక రంగాలవారికి అన్నివిధాలా ప్రోత్సాహకరం. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను వదులుకోవడం మంచిదికాదు. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

Phalgun Month 2025: ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది.. చంద్రుడిని ఆరాధిస్తే.. పండుగల సంగతేంటి?

తర్వాతి కథనం
Show comments