Webdunia - Bharat's app for daily news and videos

Install App

12-04-2019 శుక్రవారం దినఫలాలు - దంపతుల మధ్య....

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (09:16 IST)
మేషం: దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఒత్తిడి, సమస్యలు అధికం. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. మీ పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం. బంధుమిత్రుల రాకపోకులు అధికమవుతాయి.
 
వృషభం: మీరంటే కిట్టని వ్యక్తులను సైతం ఆకట్టుకుంటారు. పెరిగిన ధరలు, విద్యుత్ బిల్లులు ఆందోళన కలిగిస్తాయి. ఇతరులను సాయం అడగడానికి బిడియపడతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్థల స్థాపన విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనౌధైర్యం నెలకొంటాయి.
 
మిధునం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సంతానం భవిష్యత్ కోసం పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. రిటైర్టు ఉద్యోగస్తులు, అధికారులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
కర్కాటకం: ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. రెట్టింపు ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. పారిశ్రామిక వేత్తలకు నిరుత్సాహం, చికాకులు అధికమవుతాయి. స్త్రీలు, కొత్త వ్యక్తులతో మితంగ సంభాషించాలి. పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు.
 
సింహం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు ధోరణి ఆందోళన కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. అధికారులకు ఒత్తిడి, కిందిస్థాయి సిబ్బందితో చికాకులు అధికం. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం.
 
కన్య: బంధువుల రాక వలన ఖర్చులు అధికమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. రహస్య విరోధులు అధికం కావడంవలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు తప్పవు. దూరప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. 
 
తుల: ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో అసహానానికి లోనవుతారు. వ్యాపారాభివృద్ధికై చేయుకృషిలో పోటీ వాతావరణం అధికమవ్వడంతో ఆందోళన చెందుతారు. స్త్రీలకు మొహమ్మాటాలు, ఒత్తిళ్ళు అధికం. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కుంటారు.
 
వృశ్చికం: వివాహ సంబంధమైన దూరప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ కళత్ర పట్టుదల, సంతానం మొండివైఖరి వలన చికాకులు తప్పవు. నూతన వ్యాపారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన స్పురిస్తుంది. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.
 
ధనస్సు: ఏ.సి., కూలర్, విద్యుత్ రంగాలవారికి పనిభారం అధికమవుతుంది. బంధువులరాకతో ఖర్చులు అధికమవుతాయి. స్థిరచరాస్తుల విషయమై కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. పాత పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మరింత బలపడుతాయి. నిరుత్సాహం విడనాడి పట్టుదలతో కృషి చేసిన ధ్యేయం నెరవేరగలదు.
 
మకరం: దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ప్రైవేటు సంస్థల్లోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేసిన గానీ నిలదొక్కుకోలేరు. వాగ్వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిదని గమనించండి. 
 
కుంభం: కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలకు పరిచయాలు వ్యాపాకాలు అధికమవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేయడం మంచిదికాదని గమనించండి. 
 
మీనం: కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేయటం మంచిది కాదని గమనించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments