Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం దినఫలాలు - మిథున రాశివారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (08:55 IST)
మేషం: రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోనూ, ప్రయాణాలలోనూ మెళకువ అవసరం. అనువు కానిచోట ఆధిపత్యం చెలాయించడం మంచిదికాదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది.
 
వృషభం: స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికం. గృహోపకరణాల పట్ల మక్కవ పెరుగుతుంది. బంధువుల ఆకస్మిక రాకవలన ఖర్చులు అధికమవుతాయి. స్థిరచరాస్తుల విక్రయాలు వాయిదాపడుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 
 
మిధునం: ముఖ్యమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్, తినుబండ రంగాలలో వారికి చికాకులు తలెత్తుతాయి. స్త్రీలకు అయిన వారిని చూడాలనే ఆలోచన స్పురిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది.
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి, కుంటుంబంలో అశాంతి, చికాకులు అధికమవుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరత్రా చికాకులు ఎదుర్కోక తప్పదు. 
 
సింహం: శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగిరాజాలదు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించుటవలన మంచి గుర్తింపు లభిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కన్య: కొత్తగా చేపట్టిన వ్యాపారాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ధనం విపరీతంగా వ్యయం చేసే మీ ధోరణిని మార్చుకోవడం శ్రేయస్కరం. విద్యార్థుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. 
 
తుల: ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు బాధ్యతలతో పాటు, పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కాలాను గుణంగా మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
 
వృశ్చికం: ఒక కార్యం నిమిత్తం దూరప్రయాణం చేయవలసి వస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. చివరి క్షణంలో చేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం మంచిదికాదని గమనించండి. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. 
 
ధనస్సు: కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. ఉద్యోగస్తుల సమర్థత, సమయస్పూర్తికి అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. బంధువులతో సమస్యలు తలెత్తవచ్చు. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. అప్పడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనకతప్పదు. 
 
మకరం: స్త్రీలకు చాలా యోగప్రదంగా ఉండగలదు. మీ ఓర్పు, విజ్ఞతకు ఇది పరీక్షా సమయమని గమనించండి. స్పెక్యులేషన్, పొదుపు పథకాలు లాభిస్తాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.  
 
కుంభం: ప్రముఖుల కలయిక వలన ఆశించిన ఫలితం ఉంటుంది. రాబోయే ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు స్థిరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తలెత్తుతాయి.
 
మీనం: సంఘంలో మంచి పేరు, ఖ్యాతీ గడిస్తారు. స్త్రీల పేరిట ఆస్తి కొనుగోలుచేస్తారు. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ, ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. ధనం బాగా అందుట వలన ఏ కొంతయినా నిల్వచేయ గలుగుతారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments