08-03-2019 - శుక్రవారం మీ రాశిఫలితాలు - బాకీల వసూళ్ళల్లో శ్రమాధిక్యత...

శుక్రవారం, 8 మార్చి 2019 (09:57 IST)
మేషం: మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాలవారి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
వృషభం: రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగ యత్నాలు ఓ కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. పీచు, నార, లెదర్, ఫోమ్ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండును. సన్నిహితుల గురించి అప్రియమైన వార్తలు వింటారు. వాహన చోదకులకు ఊహించని చికాకులను ఎదుర్కుంటారు.
 
మిధునం: వ్యాపారంలో ఎంతో పక్కగా తయారుచేసుకున్న ప్రణాళికలు విఫలం కావొచ్చు. స్త్రీలు తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమం కాదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం. ఆస్తి వ్యవహారాల్లో సోదరుల తీరు మనస్తాపం కలిగిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
కర్కాటకం: విద్యుత్, ఎలక్ట్రానికల్ రంగాలలో వారు అవహేళన ఎదుర్కొనవలసివస్తుంది. విద్యార్థులకు వాహనం నడుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. నూనె మిర్చి, కంది, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. బ్యాంక్ పనులు మందకొడిగా సాగుతాయి. 
 
సింహం: ఉమ్మడి వ్యవహారాలు, సంస్థలు, ప్రాజెక్టులు, నూతన కాంట్రాక్టులకు అనుకూలం. లాయర్లు ఆసాధ్యమనుకున్న కేసులను సునాయాసంగా గెలుపొందుతారు. పాత బిల్లులు చెల్లిస్తారు. ప్రైవేటు సంస్థల్లో వారు అధిక కృషి చేసి అధికారుల మెప్పు పొందుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ధ్యేయం నెరవేరుతుంది.
 
కన్య: మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్ళల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
తుల: కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. క్రయవిక్రయాలు సామాన్యం. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. 
 
వృశ్చికం: పారిశ్రామిక రంగాల్లో వారికి కార్మిక సమస్యలు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. సంఘంలో గౌరవం కన్నా అవమానాలను ఎదుర్కుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
ధనస్సు: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందుతుంది. బంధువుల నుండి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చేకాలం. గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలుచేస్తారు.
 
మకరం: మితిమీరిన ఆలోచనులు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. స్థిరచరాస్తుల విషయంలో పునరాలోచన అవసరం. వాహనం కొనుగోలుకై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సొంత ఆలోచనలు, నిర్ణయాలే అనుకూలం. 
 
కుంభం: ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. అవసరాలు తగ్గించుకుని రుణం తీర్చడానికి యత్నించండి. ఆలస్యంగానైనా పనులు అనుకున్న విధంగా పూర్తికాగలవు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. వృత్తిపరమైన చికాకులు, ఆరోగ్య సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి.  
 
మీనం: ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు, షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారులకు పనివారలతో చికాకులు అధికం. అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించండి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భయపడకు... నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు... వివేకానంద