Webdunia - Bharat's app for daily news and videos

Install App

03-07-2019 బుధవారం మీ రాశిఫలాలు... నిరంతర కృషి, పట్టుదల ఉంటే...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (09:25 IST)
మేషం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. వస్త్ర, బంగార, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్సాంతి దూరం చేస్తారు. ప్రయాణాలలో మెళకువ అవసరం.
 
వృషభం :  కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. రావలసిన ధనం వాయిదా పడటంతో ఒకింత ఆందోళన చెందుతారు. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలు తప్పవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
మిథునం : నూతన దంపతులు మధ్య కలహాలు తలెత్తుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి, పట్టుదల అవసరమని గమనించండి. స్థిరాస్తి క్రయ, విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి. బంధువులను కలుసుకుంటారు.
 
కర్కాటకం :  ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది. నేడు చేద్దామన్న పనులు రేపటి వాయిదా వస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది.
 
సింహం : ఆర్థింకగా ఎదగలానే మీ ఆశయం నిధానంగా ఫలిస్తుంది. ప్రింటింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. బిల్లులు చెల్లిస్తారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రావలసిన ధనం సకాలంలో అందుటంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
కన్య : నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు సంతృప్తికరంగా సాగుతాయి. ఒక్కోసారి మీ జీవితభాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.
 
తుల : మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. పెద్దల సలహాలను పాటించడం మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.
 
వృశ్చికం : ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పదు. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి.
 
ధనస్సు : బంధువుల మధ్య అపోహలు తొలగిపోతాయి ఆప్యాయతలు మరింత బలపడుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. పాత మిత్రుల నుండి ఆహ్వానాలు, లేఖలు అందుకుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. అవకాశవాదులు అధికం కావడం వల్ల ఊహించని ఒత్తిడి లోనవుతారు.
 
మకరం : వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. సోదరీ, సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. ఆత్మీయులను విమర్శించుట వల్ల చికాకులను ఎదుర్కుంటారు. పత్రిక, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
కుంభం : కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. వచ్చిన సొమ్మును పొదుపు పథకాల వైపు మళ్లించండి. నమ్మకం పట్టుదలతో యత్నాలు సాధించండి, సత్ఫలితాలు పొందుతారు.
 
మీనం : హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టకుంటారు. ప్రతని విషయంలో ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. దూర ప్రయాణాల్లో వస్తువుల జారవిడుచుకునే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments