Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

28-06-2019 శుక్రవారం దినఫలాలు- శ్రీమహాలక్ష్మిని పూజించినా...

webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (10:28 IST)
మేషం : ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించిండి. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాయి. బ్యాంకు వ్యవహారాలలో హామీలు ఉండుట మంచికాదని గమనించండి. విద్యార్థులకు ఉన్నత విద్యలతో ప్రవేశం కోసం ఒత్తిడి, ఆదోళన ఎదుర్కోక తప్పదు. 
 
వృషభం : మీ పథకాలు ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాల్చగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన వంటి చికాకులు అధికమవుతాయి. 
 
మిథునం : పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, పలు ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులు క్రీడా, సాంస్కృతి రంగాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. స్త్రీలకు పనిభారం అధికంకావడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. హోటల్, తినుబండరాలు, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు కలిసివచ్చే కాలం. 
 
కర్కాటకం : రిప్రజెంటేటివ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతారు. వస్త్ర, కళంకారీ, పీచు, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కలిసివచ్చే కాలం. మిత్రుల సహకారం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. 
 
సింహం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం ప్రైవేటు సంస్థల వారికి ఏజెంట్లకు బ్రోకర్లకు ఆశించినంత సంతృప్తి కానరాదు. ప్రైవేటు సంస్థల్లో వారికి ఆత్మనిగ్రహం చాలా అవసరం. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మలను నిరాశపరుస్తుంది. విద్యార్థులు పైచదువులకై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు. 
 
కన్య : నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో సఫలీకృతులవుతారు. మిర్చి, నూనె, పసుపు, చింతపండు స్టాకిస్టులకు, రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అర్థించవచ్చు ఆరోగ్యం విషయంలో సంతృప్తికానరాదు. 
 
తుల : నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు సదావకశాలు లభిస్తాయి. ఖర్చులు అధికమైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. స్త్రీలు విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. 
 
వృశ్చికం : స్త్రీలు, మోకాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో చికాకు తప్పదు. బంధు మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. కంప్యూటర్, ఇన్వర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. 
 
ధనస్సు : విద్యార్థినిలకు టెక్నికల్, సైన్సు కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వాతావరణ మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకువేయండి. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. వృత్తులలో వారు ఆందోళనకు గురవుతారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకోవలసి వస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ నుండి ధన, వస్తు సహాయం ఆశించవచ్చు. 
 
కుంభం : హామీలు ఇచ్చే విషయంలోనూ, మధ్యవర్తిత్వ వ్యవహారాలలో మెళకువ వహించండి. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, ఆందోళన తప్పదు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల వాహనం నడపడం వల్ల ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. ఉద్యోగస్తుల మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. 
 
మీనం : ఆధ్యాత్మిక, యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు తమ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టిన పురోభివృద్ధి కానరాగలదు. తొందపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారులను తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

వేదాద్రి క్షేత్రం గురించి తెలుసా? వేదాలను రక్షించడం కోసం..?