Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం దినఫలితాలు : మీపై సెంటిమెంట్లు....

మేషం : సొంత వ్యాపారాల్లో రాణించేందుకు బాగా శ్రమించాలి. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఖర్చులు అధికమైనా భారమనిపించవు. ఒక అవకాశం అందివచ్చినట్లే వచ్చి చేజారిపోయే ఆస్కారం వుంది. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (08:21 IST)
మేషం : సొంత వ్యాపారాల్లో రాణించేందుకు బాగా శ్రమించాలి. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఖర్చులు అధికమైనా భారమనిపించవు. ఒక అవకాశం అందివచ్చినట్లే వచ్చి చేజారిపోయే ఆస్కారం వుంది. ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్స్‌లు మంజూరు కాగలవు. బంధ నుంచి నిష్ఠూరాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
వృషభం : ఉద్యోగాల్లో ఏమంత పురోగతిలేక నిరుత్సాహం చెందుతారు. మీపై సెంటిమెంట్లు, ఎదుటివారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. వాహనం, విలువైన సామగ్రి మరమ్మతులకు గురయ్యే ఆస్కారం వుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత చాలా అవసరం. 
 
మిథునం: రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. దైవదర్శనాలు, మొక్కుబడులు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. రావలసిన ధనంలో  కొంత మొత్తం అందుతుంది.
 
కర్కాటకం: ఆర్థిక కార్యకలాపాల్లో ఆదాయం బాగుగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో జయం పొందుతారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు కింది స్థాయి వ్యక్తులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర  సందర్శన నిమిత్తం అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. 
 
సింహం: మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. మిమ్ములను కలవరపరిచిన సంఘటన సునాయాసంగా సమసిపోగలదు.
 
కన్య: నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. మీ వాక్చాతుర్యమునకు తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారంలో జాగ్రత్త వహించండి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విందులలో పరిమితి పాటించండి.
 
తుల: పందాలు, పోటీలలో విజయం సాధిస్తారు. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
 
వృశ్చికం: చేతి వృత్తులు, చిరు వ్యాపారులక పురోభివృద్ధి కానవస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం ఆలోచన విరమించుకోవడం మంచిది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఒప్పందాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత ముఖ్యం. అనుకోకుండా కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోవడం మంచిది.
 
ధనస్సు: స్త్రీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగస్తులకు అధిక శ్రమ చికాకులు తప్పవు. బంధుమిత్రులను కలుసుకుంటారు. 
 
మకరం: రావలసిన బకాయిలు సకాలంలో అందినా ధనం ఏమాత్రం నిలువ చేయలేకపోతారు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. సాహిత్య సదస్సులో పాల్గొంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. 
 
కుంభం : వృత్తి, వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. స్త్రీలకు కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు తప్పవు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. మీ సంతానం ఇష్టాయిష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు.
 
మీనం: నిత్యావసర వస్టు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్త్రీలు పనివారల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పూర్వానుభావంతో నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా మహిళల ప్రవర్తన ఉండరాదు : సుప్రీంకోర్టు

Snake: గురుకులం పాఠశాలలో పాము కాటు ఘటనలు.. ఖాళీ చేస్తోన్న విద్యార్థులు

అన్నీ చూడండి

లేటెస్ట్

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments