Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢ శుక్ల ఏకాదశి.. చాతుర్మాస దీక్షకు సిద్ధం కండి..

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (13:24 IST)
ఆషాఢ శుక్ల ఏకాదశి జూలై 10వ తేదీన రానుంది. ఈ రోజున చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ నాలుగు మాసాలలో శ్రీమహావిష్ణువును పూజించవచ్చు 
 
చాతుర్మాసం ప్రారంభంతో వివాహం, క్షవరం , గృహ ప్రవేశం మొదలైన పనులు నిలిచిపోతాయి. ఈ మాసంలో శివుని పూజిస్తారు.
 
ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి ప్రారంభం: జూలై 09, శనివారం, 04:39 సాయంత్రం
 
ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి ముగింపు: జూలై 10, ఆదివారం, మధ్యాహ్నం 02.13 గంటల వరకు
 
ఈ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. ఆపై ఉపవాసం చేయాలని సంకల్పించుకోవాలి. ఉదయం నుంచి రవియోగం ఉంది. ఆపై పూజను ప్రారంభించండి లక్ష్మీదేవిని, శ్రీమహావిష్ణువును పూజించండి.
 
పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, పండ్లు, చందనం, అక్షత, తమలపాకులు, తులసి ఆకులు, పంచామృతం మొదలైన వాటిని విష్ణువుకు సమర్పించండి. ఈ సమయంలో, ఓం భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. 
 
ఆ తర్వాత విష్ణు చాలీసా, విష్ణు సహస్రనామం, దేవశయని ఏకాదశి ఉపవాస కథను పఠించండి. విష్ణువు హారతితో పూజను ముగించండి.
 
రోజంతా పండ్లు తీసుకోవచ్చు. ఆ రోజంతా భగవత్ వందన ,భజన-కీర్తనలలో సమయాన్ని గడపండి. సాయంత్రం హారతి తర్వాత రాత్రి జాగరణ చేయండి. 
 
మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ చేయాలి. బ్రాహ్మణునికి అన్నం, వస్త్రాలు, దక్షిణ ఇవ్వాలి. ఆపై పారణ చేసి ఉపవాసాన్ని విరమించాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments