Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళ దోషాన్ని తొలగించే మందార పువ్వు..

hibiscus
, సోమవారం, 4 జులై 2022 (13:41 IST)
మందార పువ్వులను పూజా సమయంలో దుర్గాదేవికి లక్ష్మీదేవికి హనుమంతుడికి సమర్పించడం వల్ల మంగళ దోషాన్ని తొలగిస్తుంది. అదేవిధంగా ఆదాయానికి కొదవ వుండదు. ఈ మందార పువ్వులను దుర్గాదేవికి సమర్పించడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభించి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది.
 
ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా కుటుంబ కలహాలు తొలగిపోయి సంబంధాలు మరింత బలపడతాయి. ఈ మొక్కను ఇంట్లో తూర్పు దిశలో నాటకం చాలా శుభప్రదంగా పరిగణించబడుతోంది. 
 
ఇక వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా సాగుతుంది. మందార పువ్వుల గుత్తులుగా పేర్చి అందంగా ఇంట్లో గదుల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
 
మందారం పూల రంగు ఆకర్షిస్తుంది. వీటిని స్త్రీలు ఎక్కువగా ఇష్ట పడతారు. ఆ మందార పువ్వులలో ఎర్ర మందారపు పువ్వు అయితే దుర్గామాతకు చాలా ప్రీతికరమైంది.
 
దుర్గామాతకు పూజ చేసే సమయంలో ఈ ఎర్ర మందార పువ్వులను దేవతలకు సమర్పిస్తూ ఉంటారు. ఈ మందార పూల మొక్కను ఇంట్లో నాటడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవడంతో పాటు ప్రతికూలతను తొలగిస్తుందట.
 
అదేవిధంగా ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా ఆ ఇంట్లో సుఖశాంతి నెలకొంటుందట. ఆర్థిక పురోగతిని సాధించడంతోపాటు ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుందట. అదేవిధంగా సూర్యభగవానుడిని మందార పువ్వులతో పూజిస్తారు. 
 
ఈ మందార పువ్వులను నీటిలో వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇది జాతకంలో సూర్యస్థానాన్ని బలపరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్లపక్షం పంచమి తిథిలో వారాహి పూజ.. సాయంత్రం ఎర్రని వత్తులతో..?