Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివలింగ పుష్పంతో పూజ.. ఫలితాలు.. అష్టైశ్వర్యాలు ఖాయం

Advertiesment
Nagalinga Flower
Nagalinga Flower
శివలింగ పుష్పంతో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని.. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. శివ లింగ పుష్పాలను ఏ దేవునికైనా సమర్పించేటప్పుడు తలపై లేదా భుజ స్కంధాలపై మాత్రమే సమర్పించాలి. పార్వతీ దేవికి ఈ పుష్పాన్ని మాంగల్యంలో సమర్పించాలని పండితులు చెప్తున్నారు.
 
ఈ పుష్పాలతో శివున్ని పూజించడం ప్రతి భక్తునికి ఒక వరం. ఈ పుష్పాలతో శివున్ని పూజించిన వారికి జన్మ రాహిత్యాన్ని పొంది అంతిమమున కైవల్యం పొందుతారని శివ పురాణం చెబుతోంది. శివలింగ చెట్టు ప్రతి భాగంలోనూ శివుడు నెలకొని ఉంటాడని విశ్వాసం. ఈ పుష్పాలు సర్వ దేవతలకు.. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతికరమైనవి. 
 
శివ లింగ వృక్షాలు ఎక్కువగా దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఉంటాయి. దీనిని నాగ లింగ వృక్షం అని కూడా అంటారు. ఈ పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పం లాగా ఉంటుంది. ఈ పుష్పాలు పై భాగాన నాగపడగ కప్పినట్టు ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. 
webdunia
Nagalinga Flower
 
ఈ పుష్పాలను నాగమల్లి, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి ఎంతో చక్కని పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి. ఈ పుష్పాలతో మంగళవారం లేదా శుక్రవారం అమ్మవారికి.. సోమ, గురు, శనివారాల్లో ఈశ్వరునికి సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

20-06-2022 సోమవారం రాశిఫలాలు ... శంకరుడిని పూజించినా...