Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాచలం గర్భగుడిపై వున్న సుదర్శన చక్రం చరిత్ర.. రామదాసుకు..? (Video)

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (11:05 IST)
Sudarshan Chakra
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. శ్రీ కంచర్ల గోపన్న( భక్త రామదాసు) గారి వంశీకుడైన శ్రీ కంచర్ల శ్రీనివాసరావు గారు ఇచ్చిన వివరణ ఆధారంగా.. భద్రాచలం గర్భగుడిపై వున్న సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాం.. ముఖ్యంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రాన్ని ఎవ్వరూ తయారు చేయలేదట. 
 
మరి ఇదెలా వచ్చిందంటే.. భక్త రామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను తెప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయారు చేయించారట. 
 
కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవడం.. సరైన ఆకృతి చేయడం వంటివి జరిగాయట. దీంతో కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు. అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు" అని చెప్పాడు. 
 
మరుసటి రోజు గజ ఈతగాళ్ళతో రామదాసు గోదావరిలో వెతికించాడు. కానీ కనిపించలేదు. మళ్లీ రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది" అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది. 
Sudarshan Chakra
 
ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న సుదర్శన చక్రాన్ని దర్శించుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఇలాంటి పలు మహిమాన్వితమైన అంశాలుండటంతోనే.. భద్రాద్రి మహా పుణ్యక్షేత్రమై భాసిల్లుతోంది.

 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments