Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం దినఫలాలు : ధనం ఎంత వచ్చినా నిలబెట్టుకోలేరు

మేషం : శ్రీమతి అభిప్రాయాలను తేలికగా కొట్టివేయటం మంచిదికాదు. పాత సమస్యలు పరిష్కారమార్గంలో నడుస్తాయి. తొందరపాటు చర్యల వల్ల వ్యవహారం బెడిసికొట్టవచ్చు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బంధువుల రాకత

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (06:08 IST)
మేషం : శ్రీమతి అభిప్రాయాలను తేలికగా కొట్టివేయటం మంచిదికాదు. పాత సమస్యలు పరిష్కారమార్గంలో నడుస్తాయి. తొందరపాటు చర్యల వల్ల వ్యవహారం బెడిసికొట్టవచ్చు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో ఇబ్బందులెదుర్కుంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం : మీరు ఇచ్చే సలహాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటాయి. మీ యత్నాలకు చక్కని అవకాశం, ప్రముఖుల సహాయం లభిస్తుంది. హోటల్, కేటరింగ్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించాలి.
 
మిథునం : స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య, ఆర్ధిక సమస్యలు, ఏ వ్యవహారం కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం : స్త్రీలకు కాళ్ళు, నడము, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు తరచు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చకోకండి. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు.
 
సింహం : ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలేర్పడతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతోపరిచయాలేర్పడతాయి. రాజకీయాలలో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు వాయిదా పడతాయి.
 
కన్య : గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. బంధువులను కలుసుకుంటారు.
 
తుల : ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. మీడియా రంగాల వారు పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఋణం తీర్చటానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు.
 
వృశ్చికం : ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేక పోతారు. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
ధనస్సు : కోర్టు వ్యవహరాలు వాయిదా పడే సూచనలున్నాయి. వైద్య రంగాల వారికి అన్ని విధాలా శుభం కలుగుతుంది. ధనం మితంగా వ్యయం చేయండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు మంచిగుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి.
 
మకరం : ముఖ్యుల రాకపోకలు అధికం అవుతాయి. ధాన్యం, అపరాలు, కంది, మిర్చి, నూనె, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసివచ్చేకాలం. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సరదాలు కోరికలు వాయిదా వేసుకోవలసివస్తుంది. వృత్తిపరమైన చికాకులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో మెళుకువ అవసరం.
 
కుంభం : ఆర్ధిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. ఏజెంట్లకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. కుటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
 
మీనం : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. కొబ్బరి, మామిడి, పండ్ల, పూల, కూరగాయల రంగాలలో వారికి అనుకూలమైన కాలం. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

కన్యాకుమారిలో 10 మీటర్ల వెడల్పుతో గాజు వంతెన.. సముద్రంపై నడిచేలా? (video)

సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివలింగం : అఖిలేష్ యాదవ్

కొత్త సంవత్సర వేడుకలొద్దు.. నన్ను కలవడానికి రావద్దు.. చింతకాయల అయ్యన్న

తమిళనాడు బీజేపీ శాఖ నన్ను పక్కనబెట్టేసింది.. సినీ నటి ఖుష్బూ

అన్నీ చూడండి

లేటెస్ట్

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

తర్వాతి కథనం
Show comments