Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోమవారం దినఫలాలు... స్త్రీలకు వస్త్ర, వస్తు ప్రాప్తి...

మేషం: భవిష్యత్ అవసరాలకు పొదుపు అవసరం. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు పనులు ఆలస్యం కావడంతో నిరుత్సాహం చెందుతారు. ఆల

Advertiesment
Today Prediction
, సోమవారం, 20 నవంబరు 2017 (06:03 IST)
మేషం: భవిష్యత్ అవసరాలకు పొదుపు అవసరం. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలి. బ్యాంకు  పనులు ఆలస్యం కావడంతో నిరుత్సాహం చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
వృషభం: ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థులకు, స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఇతరులపై ఆధారపడక, ప్రతి వ్యవహారం మీరే సమీక్షించుకోవడం అన్ని విధాల క్షేమదాయకం.
 
మిథునం: మీ జీవిత భాగస్వామి పట్ల సౌమ్యంగా వ్యవహరించండి. ఆకస్మిక  ఖర్చులు ఎదురైనా సమయానికి ధనం సర్దుబాటు కాగలదు. మీ సంతానం విపరీత ధోరణి చికాకు పరుస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. కుటుంబంలోని కొన్ని వ్యవహారాలు మీ ప్రమేయం లేకుండానే జరుగుతాయి.
 
కర్కాటకం: సినిమా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అతిధ మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. స్త్రీలకు వస్త్ర, వస్తు ప్రాప్తి, వాహన యోగం వంటి శుభ ఫలితాలుంటాయి.
 
సింహం: విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. బంధుమిత్రులు ఒత్తిడి, మొహమ్మాటాలకు గురిచేస్తారు. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
కన్య: ఇంట పెద్దమొత్తంలో ధనం, నగలు ఉంచుకోవడం క్షేమం కాదని గమనించండి. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఫైనాన్స్ దారుల ఒత్తిడి అధికమవుతుంది. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుకుంటారు.
 
తుల: ఒకానొక సందర్భంలో కుటుంబీకుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసివస్తుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
వృశ్చికం: స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా స్వల్ప అస్వస్థతకు గురవుతారు. శస్త్ర చికిత్స చేయునప్పుడు వైద్యులకు మెళకువ అవసరం. ఊహించిన దానికంటే అధిక రాబడి పెరుగును. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. కుటుంబీకుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
 
ధనస్సు: మార్కెటింగ్, ప్రైవేట్ సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం వుంది. దైవదర్శనం వల్ల మానసిక  ప్రశాంతత చేకూరుతుంది.
 
మకరం: వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. రాజకీయనాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
కుంభం: మీ వాక్చాతుర్యానికి, మంచితనానికి గుర్తింపు లభిస్తుంది. రావలసిన మొత్తం కొంత ముందు వెనుకలుగానైనా అందడం వల్ల ఇబ్బందులు అంతగా ఉండవు. స్త్రీలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆత్మీయుల సాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు. మధ్య మధ్య వైద్యుని సలహాలు వంటివి తప్పదు.
 
మీనం: ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులకు గురికావలసివస్తుంది. ప్రత్తి, పొగాకు, మిర్చి, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల ఆలోచనలు పరి పరి విధాలుగా ఉండటం వల్ల మాటపడక తప్పదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదివారం రాశిఫలాలు... చిక్కుల్లో పడే ఆస్కారం