Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు దినఫలితాలు : మనోధైర్యం పెరుగుతుంది...

మేషం : ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్ధుల్లో మనోధైర్యం పెంపొందుతుంద

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (06:21 IST)
మేషం : ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్ధుల్లో మనోధైర్యం పెంపొందుతుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో చికాకులను ఎదుర్కుంటారు. ధన వ్యయం చేస్తారు.
 
వృషభం : బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన పెట్టుబడులు, ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు మరి కొంత కాలం వేచియుండటం మంచిది. నేడు అనుకూలించని వ్యవహారాలు రేపు అనుకూలించవచ్చు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మిథునం : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉమ్మడి, ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.
 
కర్కాటకం : వ్యాపారాల అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్మాయం చూసుకోవటం ఉత్తమం. ప్రముఖులను కలుసుకుంటారు.
 
సింహం : చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపిస్తారు. సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధుమిత్రులకు మీరంటే ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారుల్లో నిలదొక్కుకోవటంతో పాటు ఖాతాదారులను ఆకట్టుకుంటారు.
 
కన్య : నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉండగలదు. మీ శ్రీమతి మొండివైఖరి చికాకు, ఆందోళనకు గురవుతారు.
 
తుల : గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడం మంచిదని గమనించండి. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
వృశ్చికం : కోళ్ల, మత్స్య, పాడి పరిశ్రమ, గొఱ్ఱెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానవచ్చును. విలువైన వస్తువులు ఏర్పరచుకోవాలనే స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి.
 
ధనస్సు : ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. మీ యత్నాలకు సన్నిహితులు, కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ముఖ్యుల కోసం షాపింగ్‌లు చేస్తారు.
 
మకరం : విదేశీయాన ప్రయాణాలు వాయిదాపడతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు. సినిమా, విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇచ్చిపుచ్చుకనే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.
 
కుంభం : ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఏదైనా అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడగలవు. ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి. మీరు ప్రేమించే వారి వల్ల కొంత నష్టపోయే ఆస్కారం ఉంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం : క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కీడు తలపెట్టె స్నేహానికి దూరంగా ఉండండి. స్త్రీలు ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Kanuma: సంక్రాంతి సంబరం..కనుమ విశిష్టత.. రైతన్న నేస్తాలు పశువులకు పండగ

Makara Jyothi: శబరిమలపై మకర జ్యోతి.. దివ్య కాంతిని వీక్షించిన లక్షలాది భక్తులు

14-01-2025 మంగళవారం దినఫలితాలు : శ్రమతో కూడిన ఫలితాలున్నాయి...

మకర సంక్రాంతి- 12 రాశులు చేయాల్సిన దానాలు.. గంగమ్మ భువిపైకి?

తర్వాతి కథనం
Show comments