Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలుగు ఆచార్యుడు త్రివిక్రమ్ రెడ్డికి అరుదైన అవార్డు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (20:38 IST)
అమెరికాలో తెలుగు ఆచార్యుడికి అరుదైన అవార్డు లభించింది. న్యూజెర్సీలో ఉంటున్న త్రివిక్రమ్ రెడ్డి భానోజీ పాలకు న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.జె.ఐ.టీ) ఎక్సలెన్ప్ ఆఫ్ టీచింగ్ పురస్కారాన్ని ప్రకటించింది. మెకానికల్ విద్య బోధనలో అత్యుత్తమ ఆధ్యాపకుడని ఆయన సేవలను ప్రశంసించింది. మెషిన్ డిజైన్, మెకానికల్ సిస్టమ్ డిజైన్‌తో పాటు స్ట్రైస్ ఎనాలిసిస్.. కూడా చక్కగా బోధించే త్రివిక్రమ్ రెడ్డి ఎన్.జె.ఐ.టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

 
రేట్ మై ప్రొఫెసర్ అని ఇచ్చే ర్యాంకింగ్లో కూడా టాప్ రేటింగ్ వచ్చిన ప్రొఫెసర్‌గా నిలిచారు మన తెలుగు బిడ్డ త్రివిక్రమ్ రెడ్డి. ఇది యావత్ తెలుగుజాతి గర్వించే విషయం. ఒకవైపు విద్యాబోధన కొనసాగిస్తూనే మరోవైపు బెక్టన్ డికిన్సన్ కంపెనీలో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టాప్ ఇంజనీరుగా కూడా త్రివిక్రమ్ రెడ్డి సేవలందిస్తున్నారు. రోగులకు మందులను సరఫరా చేసేందుకు సరికొత్త పరికరాలను కూడా త్రివిక్రమ్ రెడ్డి రూపొందించారు.

 
ఇలా తాను రూపొందించిన ఏడు పరికరాలకు పేటెంట్లను కూడా సాధించారు. తాజాగా ఎన్.జె.ఐ.టీ వారి ఎక్స్ లైన్స్ ఆఫ్  టీచింగ్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని త్రివిక్రమ్ రెడ్డి తెలిపారు. తన బోధనలు, పరిశోధనలు మరింత ఉత్సాహంతో కొనసాగిస్తాను అని తెలిపారు.

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments