Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికాగోలో తెలుగు కుటుంబాలకు నాట్స్ దీపావళి కానుకలు

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (14:48 IST)
అమెరికాలో తెలుగుజాతి కోసం పని చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా దీపావళి సందర్భంగా చికాగోలో ఉంటున్న తెలుగు కుటుంబాలకు దీపావళి కానుకలు పంపిణి చేసింది. చికాగోలో దాదాపు 300 తెలుగు కుటుంబాలకు నాట్స్ చికాగో విభాగం సభ్యులు ఇంటింటికి వెళ్లి దీపావళి కానుకలు అందించారు. దీపావళి పండుగనాడు ప్రతి ఇంట సంతోషం నిండాలనే ఆకాంక్షతో నాట్స్ ఈ కార్యక్రమం చేపట్టింది.
 
ఈ కార్యక్రమంలో నాట్స్ చాప్టర్ నాయకులు హరీష్ జమ్ముల, బిందు వీధులమూడి, వీర తక్కెళ్లపాటి, నరేంద్ర కడియాల, మనోహర్ పాములపాటి, అంజయ్య వేలూరు, వినోద్, సునీల్ ఆకులూరి, భారతి పుట్ట, రోజా శీలంశెట్టి, నరేష్ యాద తదితరులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మూర్తి కొప్పాడ, శ్రీని అరసడ, శ్రీని బొప్పన, రవి శ్రీకాకుళంతో పాటు నాట్స్ కార్యవర్గ సభ్యులు మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె.బాలినేని, లక్ష్మి బొజ్జలు ఈ కార్యక్రమానికి చక్కటి మార్గదర్శకత్వం చేశారు.
 
దీపావళి కానుకలు అందించేందుకు నాట్స్ సభ్యులు విరాళాలు అందించడంతో పాటు కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంటింటికి దీపావళి కానుకలు పంపిణి చేయడంలో కీలకపాత్ర పోషించడం అభినందనీయమని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. చికాగో నాట్స్ చాప్టర్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి నాట్స్ చికాగో విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం