Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన

Advertiesment
NATs
, శుక్రవారం, 13 అక్టోబరు 2023 (22:47 IST)
భాషే రమ్యం సేవే గమ్యం అనే తన నినాదానికి అనుగుణంగా నాట్స్ అనేక సేవ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే గాంధీ జయంతి సందర్భంగా డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం గత 13 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం గాంధీ జయంతి సందర్భంగా ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈసారి మంచి స్పందన లభించింది. తాజాగా నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ ద్వారా 360 పౌoడ్లకు పైగా వచ్చిన ఫుడ్‌కాన్స్‌ను స్థానిక నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌కు అందించింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, ఒక్క పూట కూడా భోజనం లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు, వసతిలేని వారు, అనాధ ఆశ్రమాలకు నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ నాట్స్ ఇచ్చిన ఫుడ్‌ని అందించనుంది.
 
పేదరికం కారణంగా ఎవరూ ఆకలితో అలమటించకూడదనే సేవా భావంతో నాట్స్ ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ సంవత్సరం ఫుడ్ డ్రైవ్ నిర్వహణలో డల్లాస్ చాప్టర్ కో-ఆర్డినేటర్ సత్య శ్రీరామనేని, ఇతర కార్యవర్గసభ్యులు కీలక పాత్ర పోషించారు. ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా ఈ ఫుడ్ డ్రైవ్‌ను నిర్వహిస్తూ పేదలకు ఆహారాన్ని అందిస్తున్నందుకు నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు నాట్స్ డల్లాస్ విభాగం నాయకులను ప్రశంసించారు. 
 
ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేసిన డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామనేని, కార్యవర్గసభ్యులు రవీంద్ర చుండూరు, శివ నాగిరెడ్డి, వెంకట్, ఇతర సభ్యులకు నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (బాపు), బోర్డు అఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, నేషనల్ కోఆర్డినేటర్ కవిత దొడ్డ, జోనల్ వైస్ ప్రెసిడెంట్ డీవీ ప్రసాద్‌లు ప్రత్యేక అభినందనలు తెలిపారు. డల్లాస్ విభాగం ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి ధన్యవాదాలు తెలిపారు.
 
నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకు పోషక దాతలు అయిన స్వాగత్ బిర్యానీస్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, ఫార్మ్ 2 కుక్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, అజెనిక్స్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ వారికి నాట్స్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో అజ్మల్ పెర్ఫ్యూమ్స్ 50వ రిటైల్ స్టోర్ ప్రారంభోత్సవం