Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంత్రీ భార్యాభర్తలు, తెలుగు విద్యార్థుల నుంచి 10 కోట్ల వసూలు, యుఎస్ నుంచి పరార్

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (17:26 IST)
అమెరికాలో హెచ్1 వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను నట్టేట ముంచారు కిలాడీ జంట. అమెరికాలో చదువుకుంటున్న ఎఫ్ 1 వీసా కలిగి ఉన్న స్టూడెంట్స్‌కి హెచ్ 1 వీసాలు ఇప్పిస్తానని కోట్లు వసూలు చేశారు ముత్యాల సునీల్, ప్రణీత. 30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర సుమారు 10కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు.
 
అంటే ఒక్కో విద్యార్థి దగ్గర 25 వేల డాలర్లను వసూలు చేశారు. నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు 30 మంది తెలుగు విద్యార్థులు. ముత్యాల సునీల్, ప్రణీతలపై ఇంటర్‌పోల్ నోటీసులను జారీ చేశారు. దీంతో పరారయ్యారు సునీల్, ప్రణీతలు.
 
విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రి సత్యనారాయణ కూడా పరారీలో ఉన్నారట. వీరు యూరప్ పారిపోయినట్లు భావిస్తున్నారు. సునీల్ తండ్రి స్వస్థలం వెస్ట్ గోదావరి. తండ్రి కోసం పోలీసులు వస్తే ఆయన కూడా పరారీలో ఉన్నారట. 
 
హెచ్ 1 వీసాల కోసం ఎవరిని నమ్మొద్దు అంటున్నారు పోలీసలు. కన్సల్టెంట్ కంపెనీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పారిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని, దీన్నయినా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments