Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా నుంచి ముగ్గురు హైదరాబాద్ విద్యార్థుల మృతదేహాలు...

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (14:31 IST)
గత ఏడాది క్రిస్మస్ పండుగ నాడు జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు సజీవదహనమైన సంగతి తెలిసిందే. వీరు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరి మృత దేహాలు ఈరోజు తెల్లవారు జామును అమెరికా నుంచి హైదరాబాదుకు చేరుకున్నాయి.

హైదరాబాదులోని నారాయణపేట చర్చిలో వీరి భౌతిక కాయాలకు ప్రార్థనలు నిర్వహించి అనంతరం శనివారం సాయంత్రం 5 గంటలకు నల్లగొండ జిల్లాలోని వారి స్వగ్రామంలో ఖననం చేయనున్నారు.
 
డిసెంబరు క్రిస్మస్ పండుగ సందర్భంగా అమెరికాలోని కొలిర్‌ వ్యాలీలోని ఓ ఇంట్లో వీరు దీపాలు వెలిగించి వుంచారు. ఆ తర్వాత వీరంతా నిద్రపోయారు. అర్థరాత్రి గాఢ నిద్రలో వుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా వీరిలో తెలంగాణకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సజీవ దహనమయ్యారు. వీరంతా నల్గొండ జిల్లాకు చెందిన సాత్విక నాయక్, సుహాస్ నాయక్, జయ్ సుచితలుగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments