Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో మిర్చి మంచిదే..

శీతాకాలంలో మిర్చి ఆహారంలో చేర్చుకోవాలంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిర్చీలో లో-కేలరీలు వుంటాయి. జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఇతర వంటకాలతో పోలిస్తే మిర్చీవేసి చేసిన వంటకాలు జీవక్రియల వేగాన

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (17:47 IST)
శీతాకాలంలో మిర్చి ఆహారంలో చేర్చుకోవాలంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిర్చీలో లో-కేలరీలు వుంటాయి. జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. ఇతర వంటకాలతో పోలిస్తే మిర్చీవేసి చేసిన వంటకాలు జీవక్రియల వేగాన్ని 50 శాతం మేర పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మిర్చీ శరీరంలోని వ్యర్థాలని బయటకు నెట్టేస్తాయి. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. 
 
కళ్లు, చర్మ ఆరోగ్యానికి మిర్చిలోని విటమిన్‌ సి, బీటాకెరొటిన్‌లు ఎంతగానో ఉపకరిస్తాయి. రక్తహీనత, ఆస్టియోపొరోసిస్‌ ఉన్నవారు తాజా పచిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. మిర్చిల్లోని ఎండార్ఫిన్లు మనలోని ఉద్వేగాలని అదుపులో ఉంచుతాయి.
 
శీతాకాలంలో చికెన్‌తో మిర్చి గ్రేవీ తీసుకుంటే పిల్లల్లో జలుబు దూరం అవుతుంది. దగ్గు నయం అవుతుంది. అలాంటి పచ్చిమిర్చి-చికెన్ గ్రేవీ ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు: 
చికెన్ -అరకిలో, 
పసుపు: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడా, 
నూనె: తగినంత, వెన్న: టేబుల్‌స్పూను, 
మిరియాలపొడి: టీస్పూను, 
గరంమసాలా: టీస్పూను,
పెరుగు: అరకప్పు, 
ఉల్లిపాయ: ఒకటి, కరివేపాకు: రెబ్బ
 
తయారీ విధానం: 
శుభ్రం చేసిన ముక్కలకు మిరియాలపొడి, గరంమసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఉంచాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు తలా ఓ కప్పు, ఐదు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి.. వీటిని మిక్సీలో రుబ్బుకుని పక్కనబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక వెన్న లేదా నెయ్యి వేసి ఉల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత చికెన్‌ ముక్కలు, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలుపుతూ పది నిమిషాల పాటు వేపుతూ వుండాలి. తర్వాత పెరుగు చేర్చి చికెన్ ముక్కలు వుడికే దాక వుంచి గ్రేవీ అయ్యాక దించేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments