మృగశిర కార్తె వచ్చేసింది.. కొరమీను కూర ఇలా ట్రై చేయండి..

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (19:43 IST)
కావలసిన పదార్థాలు 
కొరమీను చేపలు - అరకేజీ, 
అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, 
ఉల్లిపాయ - ఒకటి, 
ఉప్పు - రుచికి తగినంత, 
పసుపు - అర టీస్పూన్‌, 
కారం- రెండు టీస్పూన్లు, 
నూనె - సరిపడా, 
కరివేపాకు - కొద్దిగా, 
కొత్తిమీర - ఒకకట్ట.
ధనియాల పొడి -  రెండు టీస్పూన్లు
జీలకర్రపొడి - అర టీస్పూన్‌, 
మెంతిపొడి - అర టీస్పూన్‌, 
చింతపండు - యాభై గ్రాములు
 
తయారీ విధానం: ముందుగా శుభ్రం చేసుకున్న చేపముక్కలను కాస్త కారం, ఉప్పు చేర్చి పక్కనబెట్టుకోవాలి. ఒక బౌల్‌లో చింతపండు రసం, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి బాగా కలపాలి.
 
ఆపై ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేగాక, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక ధనియాల పొడి వేయాలి. 
 
తరువాత కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకోవచ్చు. తర్వాత సిద్ధం చేసుకున్న చింతపండు రసం మిశ్రమాన్ని చేర్చి బాగా ఉడకనివ్వాలి. గ్రేవీలా తయారయ్యాక 
 
కొర్రమీను ముక్కలు వేసి ఐదు నుంచి 10 నిమిషాల పాటు ఉడికిన తరువాత కొత్తిమీర వేసుకొని దించాలి. అంతే కొరమీను గ్రేవీ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సెక్యూరిటీ చెక్ పేరుతో కొరియన్ మహిళపై లైంగిక దాడి.. ఎక్కడ?

Kavitha: ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆంధ్ర నాయకుల విగ్రహాలను తొలగించాలి: కల్వకుంట్ల కవిత

భర్త గుండెలపై ప్రియుడిని కూర్చోబెట్టి దిండుతో అదిమి చంపేసిన భార్య

ఔను, మా వద్ద వున్న రహస్య ఆయుధం ప్రపంచంలో ఎవ్వరివద్దా లేదు: ట్రంప్

నంద్యాల జిల్లాలో బ‌స్సు ప్ర‌మాదం: ముగ్గురు మృతి.. పది మందికి పైగా గాయాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M. M. Keeravani: ఎం.ఎమ్‌.కీరవాణి ఆలపించిన శ్రీ చిదంబరం చిత్రంలోని పాట

ఫైట్ సీక్వెన్స్ పూర్తిచేసుకున్న హీరో చంటి చిత్రం పేట రౌడీ

Pawan: మన శంకర వరప్రసాద్ గారు చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ శుభాకాంక్షలు

Srinath Maganti: ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో హిట్ చిత్ర ఫేమ్ శ్రీనాథ్ మాగంటి

కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)

తర్వాతి కథనం
Show comments