Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరామ నవమి: పానకం, వడపప్పు ఎలా చేయాలంటే?

Panakam_Vadapappu
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (19:34 IST)
శ్రీరామ నవమి అంటే ముందుగా గొర్తొచ్చేది పానకం, వడపప్పు, చలిమిడి. ఈ వంటకాలు ఆ శ్రీరామ చంద్రుడికి కూడా ఎంతో ఇష్టమని అంటారు. అలాంటి కమ్మని వంటకాలను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం
 
ముందుగా పానకం.. 
కావాల్సిన పదార్థాలు.. 
నీళ్లు   - లీటర్
బెల్లం   -  వంద గ్రాములు
యాలుకలు   - ఐదు
మిరియాలు  - నాలుగు
 
ముందుగా యాలకులపై పొట్టును తొలగించి గింజలను పౌడర్‌గా తయారు చేసుకోవాలి.  తరువాత మిరియాలను కూడా పౌడర్ చేసి.. ఈ రెండింటినీ నీళ్లల్లో వేయాలి. ఆ తర్వాత ఈ నీళ్లలో బెల్లాన్ని కూడా వేయాలి. ఈ బెల్లం మొత్తం కరిగేదాక ఆ నీళ్లను బాగా కలుపుకోవాలి. అంతే కమ్మనైన పానకం సిద్ధం.  
 
వడపప్పు ఎలా చేయాలంటే?
కావలసిన పదార్థాలు:
పెసరపప్పు  - ఒక కప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్
కొత్తిమీర తరుగు  -  రెండు స్పూన్లు 
కొబ్బరి తురుము  -రెండు స్పూన్లు 
ఉప్పు  - రుచికి తగినంత
 
తయారీ విధానం.. 
పెసరపప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి.  ఆ తర్వాత నీటిని వడకట్టేసి, పప్పును ఒక గిన్నెలో వేయాలి. దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే వడపప్పు రెడీ  అయినట్టే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరామ నవమి వేడుకలు... కుటుంబంలో ఆనంద డోలికలు