Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కాలం.. ఇంటివద్దే శ్రీరామ నవమిని ఇలా చేసుకుందాం..

Advertiesment
కరోనా కాలం.. ఇంటివద్దే శ్రీరామ నవమిని ఇలా చేసుకుందాం..
, సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:31 IST)
పూర్వకాలంలో కనులారా శ్రీ సీతారామ కళ్యాణం చూడడం కోసం వేసే తాటాకు పందిళ్ళు, దోసిళ్ళతో వడపప్పు, గ్లాసులతో పానకాలు, విసురుకోవడానికి విసినకర్రలు, కల్యాణంకి వచ్చే ముత్తయిదువులకు ఇచ్చే తాంబూలాలతో అత్యంత కోలాహలంగా జరిగేవి. అయితే ప్రస్తుత రోజుల్లో అవన్నీ మాటలవరకే పరిమితం. ప్రస్తుతం కరోనా కాలం కాబట్టి శ్రీరామనవమిని ఇంటి వద్దే ఇలా జరుపుకోవడం మంచిది. 
 
శ్రీరామనవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి.
 
శ్రీ సీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి.
 
అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.
 
ఇక శ్రీరామ దేవాలయం, భద్రాచలం, ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ వంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణము వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది.
 
నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచుదీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయని పురోహితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇప్పుడు మన ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా?