Publish Date: Thu, 15 Apr 2021 (19:23 IST)
Updated Date: Thu, 15 Apr 2021 (19:25 IST)
నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది.
దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను.
నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు.
నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు.
మూఢులు మాత్రం నమ్ముతారు.
మరొక విచిత్రం పుడుతుంది.
వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు.
వారిని చూసి నేనని భ్రమపడవద్దు.
నా రాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు.
ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.