Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరామ నవమి వేడుకలు... కుటుంబంలో ఆనంద డోలికలు

Payasam
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (18:19 IST)
దేశవ్యాప్తంగా, భగవంతుడైన రాముని జన్మదినోత్సవాన్ని అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. ఈ రోజున భారతదేశంలోని ప్రతి ఇంటిలోనూ తమవైన ఆచారాలను అనుసరిస్తూ విభిన్నమైన పిండివంటలు తయారుచేస్తుంటారు. తెలంగాణాలో విభిన్నమైన సంప్రదాయాలు మిళితం కావడంతో పాటుగా రామనవమి వేడుకలను చేయడం చూపురులను సైతం కట్టిపడేస్తుంది.

 
వేసవి సీజన్‌లో ఎండ వేడిమి పెరిగే వేళ జరిగే ఈ పండుగల వేళ కనిపించే క్యుసిన్‌లు మన శరీరంలోని వేడిని గ్రహించే రీతిలో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో నీర్‌మోర్‌, పానకం, కొసాంబరీ వంటివి దేవునికి అర్పిస్తారు. రామనవమి వేడుకలలో అత్యంత ఆసక్తికరమైన సమ్మర్‌ కూలర్‌గా పానకంను చెప్పాల్సి ఉంటుంది. ఈ పానకాన్ని నీరు, నిమ్మరసం, భారతీయ మసాలా దినుసులతో తయారుచేస్తారు. నీర్‌ మోర్‌ (దీనిని పలు చోట్ల పలు పేర్లతో పిలుస్తారు) అనేది మసాలాలతో కూడిన మజ్జిగ. దీనిని తయారుచేయడం కూడా సులభమే! పెసరపప్పుతో కొశాంబరి అనేది అతి సులభంగా జీర్ణమయ్యే సలాడ్‌.

 
దక్షిణ భారతదేశంలో ఈ రామనవమి వేడుకలలో కనిపించే మరో ఆసక్తికరమైన డిష్‌ సుందాల్‌. దీనిని రజ్మా లేదంటే గ్రీన్‌పీస్‌, కాలాచానాతో కలిపి తయారుచేప్తారు. ఉల్లిపాయ లేదంటే వెల్లుల్లి లేకుండా కొబ్బరి, మసాలాలు తో చేసే వేపుడు ఇది. దీని కోసం వినియోగించే నూనె ఖచ్చితంగా తేలికైనది, వాసనలేనటువంటిది కావాల్సి ఉంటుంది.

 
పండుగ పురస్కరించుకుని ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు అష్టమి లేదా నవమి నాడు తమ ఉపవాసం ఉపసంహరిస్తారు. వారు ప్రధానంగా పూని, కాలాచాలా, సూజీ హల్వా తింటారు. ఇక పండుగ వేళ కనిపించే స్వీట్లలో ఎల్లో మూంగ్‌ దాల్‌, బెల్లం, కొబ్బరి పాలతో పాసిపరుప్పు పాయసం నుంచి శెనగపప్పు బూరెలు, బాదం హల్వా, కొబ్బరి లడ్డూలు వంటివి ఉంటాయి.

 
గోల్డ్‌డ్రాప్‌ డైరెక్టర్‌-సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ, ‘‘మహమ్మారి వేళ మనమెంతో మిస్‌ అయ్యాము, చివరకు ఆనంద సమయం వచ్చింది. పండుగలకు సరికొత్త నిర్వచనం వచ్చింది. ఇంటిలో వండిన రుచులు మరోమారు బంధువులకు ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమైంది. జీవితమంటే అదే కదా!’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యాభర్తలు కలిసి అలా చేయొచ్చా.. ఆహారం వడ్డించిన పళ్ళెమును దాటితే?