Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలతో గారెలు ఎలా చేయాలి..?

Webdunia
సోమవారం, 15 మే 2023 (12:54 IST)
Fish Vadai
చేపలతో గ్రేవీ, ఫ్రై ఇలా రకరకాలుగా వంటకాలను టేస్ట్ చేసి వుంటారు. ఈరోజు మనం చేపలతో గారెలు ఎలా తయారుచేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
చేప ముక్కలు - 500 గ్రా 
గుడ్డు - 1 
బంగాళాదుంప - 100 గ్రా 
కారం - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 3 
కొత్తిమీర తరుగు - కొద్దిగా 
ఉప్పు - కావలసినంత 
నూనె - వేయించడానికి
 
తయారీ విధానం
ముందుగా చేపలను కడిగి శుభ్రం చేసి కొద్దిగా నీళ్లతో బాణలిలో వేసి మరిగించాలి. తర్వాత దాన్ని తీసుకుని ముల్లు, చర్మం తీసేయాలి. ఆపై బంగాళాదుంపలను ఉడకబెట్టి, తొక్క తీసి బాగా మెత్తగా చేయాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో ముళ్లు తీసిన చేపలు, మెత్తని బంగాళదుంపలు, కారం, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, గుడ్డు వేసి బాగా మెత్తగా గారెల పిండిలా చేయాలి.

ఆపై బాణలిని ఓవెన్‌లో పెట్టి నూనె పోసి వేడి అయ్యాక అందులో ఫిష్ మసాలాతో గారెల్లా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చాక తీసేయాలి. అంతే రుచికరమైన చేపలతో గారెలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments