Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్రిల్ కోసం ఓవర్‌ డోస్‌ డ్రగ్స్ ... ప్రాణాలు కోల్పోయిన యువతి.. ఎక్కడ?

వరుణ్
గురువారం, 11 ఏప్రియల్ 2024 (07:37 IST)
ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఎంజాయ్‌మెంట్ కోసం మాదకద్రవ్యాన్ని మోతాదుకు మించి తీసుకుంది. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని లక్నో, తివారీగంజ్‌ ప్రాంతంలో 18 ఏళ్ల యువతి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 3వ తేదీ లక్నోలోని తన ఇంటికి వెళ్లింది. అనంతరం ఏప్రిల్‌ 7వ తేదీన ఆమె బెంగళూరుకు తిరుగు ప్రయాణమైన సమయంలో తన స్నేహితుడు వివేక్‌ మౌర్యను కలిసింది. అనంతరం వారు ఓ ఖాళీ ప్లాట్‌కు వెళ్లారు. 
 
డ్రగ్స్‌ తీసుకుంటే థ్రిల్‌ వస్తుందని వివేక్‌ ఆ యువతికి ఓ సిరంజిని ఇంజెక్ట్‌ చేశాడు. డ్రగ్స్‌ మోతాదు ఎక్కువ కావడంతో కొంతసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దీంతో భయపడిన యువకుడు తానూ మత్తులో ఉండడంతో పోలీసులకు ఫోన్‌ చేసి సహాయం కోరాడు. వారు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ చికిత్స పొందుతూ యువతి మరణించింది. ఈ విషయం తెలియగానే యువకుడు భయాందోళనకు గురై ఆసుపత్రి నుంచి పారిపోగా పోలీసులు అతడిని ఇందిరా కెనాల్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. యువకుడు ఉద్దేశపూర్వకంగా తమ కుమార్తెను హత్య చేసి ఉండవచ్చని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments