Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నం వండిపెట్టలేదని రూమ్‌మేట్‌ను కొట్టి చంపేశారు..

Advertiesment
Man thrashed by roommates to death for not cooking rice

సెల్వి

, సోమవారం, 8 ఏప్రియల్ 2024 (23:18 IST)
హైదరాబాద్ జీడిమెట్లలో రూమ్‌మేట్‌ను హత్య చేశారు. అన్నం వండలేదనే పాపానికి 38 ఏళ్ల వ్యక్తిని అతని రూమ్‌మేట్స్ కొట్టి చంపారు. ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన హన్స్‌రామ్‌ అనే బాధితుడు గతంలో కుత్బుల్లాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 
 
అతని నిరంతర మద్య వ్యసనం అతని భార్యపై నిరంతర వేధింపులకు దారితీసింది. ఇక వేధింపులు భరించలేక, పుట్టింటికి వెళ్లింది. ఆపై హన్స్‌రామ్‌ను వారి ఇంటిని ఖాళీ చేసి బినయ్ సింగ్ గదికి మకాం మార్చాడు.
 
బినయ్ సింగ్ స్థానిక గ్రానైట్ వ్యాపారి వద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి గదిలోనే హన్స్‌రామ్ అనే వ్యక్తితో కలిసివున్నాడు. అలాగే అదే గదిలో బీహార్‌కు చెందిన సోనూ తివారీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్ కుమార్‌లు నివసిస్తున్నారు. 
 
మంగళవారం, పని నుండి తిరిగి వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న నిందితులు, అన్నం వండలేదని బినయ్ సింగ్‌పై దాడి చేశారు. ఇంకా వారు హన్స్రామ్‌ను కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైక్ ఇచ్చిన షర్మిల.. జగన్‌పై ప్రశంసలు కురిపించిన యువకుడు..