Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: నిరుద్యోగులకు రూ.8,500

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (11:57 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో నిరుద్యోగుల ఓట్లను ఆకర్షించేందుకు వీలుగా నెలకు రూ.8500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అలాగే, మహిళలకు ప్రతినెలా రూ.2500, గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని, సామాజిక పింఛన్‌ను నెలకు రూ.5 వేలు చొప్పున అందజేస్తామని వెల్లడించారు. 
 
ఈ మేరకు బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అలాగే, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని, కుటుంబానికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని, ఉచిత రేషన్ కిట్లు కూడా పంపిణీ చేస్తామని, ఢిల్లీ నగరంలో 100 ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేసి, రూ.5 కే భోజనం అందిస్తామని, యమునా నదికి ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. 
 
ఆరోగ్యం, విద్య, మహిళా, మైనారిటీ, ఎస్సీ, పూర్వాంచలీ, ఎల్జీబీటీ క్యూఐఏ అంశాలకు సంబంధించి మొత్తం.. అనేక హామీలతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ కమ్యూనికేషన్‌ల విభాగం ఇన్‌చార్జి జైరాం రమేశ్ కలిసి ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ విడుదల చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ5 వేల పింఛన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఉద్యోగాలు చేసే మహిళల కోసం మరిన్ని హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments