Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పూర్‌లో జికా వైరస్: పదికి చేరిన కేసులు..

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (18:50 IST)
ఉత్తరప్రదేశ్ కరోనా కట్టడిలో సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా జికా వైరస్ యూపీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఇటీవల జికా వైరస్ కేసులు అధికమవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఆదివారం రోజున కొత్తగా మరో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఉత్తరప్రదేశ్‌లో జికా వైరస్ కేసులు పదికి చేరాయి.
 
ఈ అంశంపై యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. జికా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జికా వ్యాధి వచ్చిన వారికి క్లోజ్‌గా ఉన్నవారి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. ఇప్పటి వరకు ఇలా 654 నమూనాలను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకీ తరలించారు. ఇప్పటి వరకు 507 నమూనాలను పరీక్షిస్తే 9 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
అక్టోబర్ 22న యూపీలో మొదటి జికా కేసు నమోదైంది. ముఖ్యంగా దోమల వల్ల జికా వైరస్ వ్యాపిస్తుంది. దీంతో కాన్పూర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. దోమల ఆవాసాలుగా ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తున్నారు. మరోవైపు జికా వ్యాధిగ్రస్తుల కోసం కాశీరామ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాత దిల్ రాజు నివాసాల్లో ఐటీ మెరుపుదాడులు

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments