Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరొకరితో నిశ్చితార్థం చేశారనీ.. ప్రియురాలు.. ఆమె తల్లిని హతమార్చిన ప్రియుడు..

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (16:57 IST)
తన ప్రియురాలికి మరో  వ్యక్తితో నిశ్చితార్థం చేశారన్న అక్కసుతో ఓ ప్రేమోన్మాది ప్రియురాలితో పాటు.. ఆమె తల్లిని కూడా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జరార్ బ్లాక్ ఏరియాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జరార్ బ్లాక్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో రెండు వారాల కిందట యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరొక వ్యక్తితో పెండ్లి ఖరారు చేశారు. 
 
గర్ల్‌ఫ్రెండ్‌పై కోపం పెంచుకున్న నిందితుడు ఆమెతో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. అడ్డగించిన బాధితురాలి వదిననీ కత్తితో గాయపరిచాడు. బాధితురాలు, ఆమె తల్లి నిద్రిస్తుండగా టెర్రస్‌పై నుంచి లోపలికి ప్రవేశించిన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
 
పదునైన ఆయుధంతో వీరిపై దాడికి దిగడంతో తల్లీ కూతుళ్లు కామిని, శారదా దేవి మరణించారు. వారి అరుపులు విని అక్కడికి వచ్చిన బాధితురాలి వదినపైనా దాడిచేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. 
 
ప్రియురాలితో గత ఏడాదిగా నిందితుడు గోవింద్‌కు సంబంధం ఉందని దర్యాప్తులో వెల్లడైందని ఐజీ సతీష్‌ గణేష్‌, ఎస్‌ఎస్పీ బబ్లూ కుమార్‌ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పలు బృందాలను నియమించామని కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments