Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

కన్నబిడ్డపై ఏడాదిగా లైంగిక దాడి చేసిన తండ్రి.. ఓపిక లేక పోలీసులకు..?

Advertiesment
father
, గురువారం, 4 మార్చి 2021 (18:00 IST)
వావి వరుసలు మరిచి  ఓ కామాంధుడు కన్నకూతురిపైనే కన్నేశాడు. ఏడాది పాటు కన్నకూతురుపైనే లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ దుర్మార్గపు తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది కాలంగా ఆ బాలికపై ఘాతుకానికి పాల్పడుతున్నప్పటికీ... తండ్రి జైలుపాలవుతాడనే భయంతో ఎవ్వరికీ చెప్పకుండా ఉండిపోయింది. ఎడాదవుతున్నా అతని అకృత్యాలు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
 
భోపాల్‌లోని జహంగీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో ఓ బాలిక ఆరో తరగతి చదువుతుంది. ఏడాది క్రితం ఇంట్లో తన తల్లి లేని సమయంలో కన్నతండ్రే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కాగా, గత నెల ఆ బాలిక అమ్మమ్మ చనిపోయింది. దీంతో ఆమె అప్పటి నుంచి తాత దగ్గరే ఉంటుంది. 
 
ఈ క్రమంలో ఫిబ్రవరి 28న అక్కడికి వెళ్లిన ఆమె తండ్రి మద్యం మత్తులో మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడాదిగా కొనసాగుతున్న అకృత్యాలు ఆగకపోవడంతో ఓపిక నశించిన ఆ అభాగ్యురాలు జరిగిన విషయం తల్లికి చెప్పింది. ఆమె తన భర్తను నిలదీయడంతో ఇద్దరిపై దాడికి దిగాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
 
తన తండ్రి ఏడాదిగా తనపై లైంగికదాడికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై మొదటిసారి దాడి జరిగినప్పుడు తన తమ్ముళ్లు కూడా ఇంట్లోనే ఉన్నారని, అమ్మమ్మ ఇంటికి వెళ్లినా ఈ తంతు కొనసాగుతూనే ఉందని అందులో పేర్కొంది. 
 
ఇన్నాళ్లు తండ్రిని జైళ్లో పెడతారని భయపడి ఎవ్వరికీ చెప్పలేదని తెలిపింది. ఆ కీచక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిందూపురంలో బాలయ్య రోడ్ షో: వాహనం తప్ప జనం లేరు