Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని ఊపేస్తున్న కరోనా.. ఎల్లో అలెర్ట్... సీఎం కేజ్రీవాల్ వెల్లడి

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (17:31 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగదల కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉంది. అయితే, ముందస్తు చర్యల్లో భాగంగా, ఢిల్లీలో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "రెండు రోజులకు పైగా కరోనా పరీక్షల్లో పాజిటివ్ రేటు 0.5 శాతానికి పైనే ఉంటుంది. అందువల్ల లెవల్-1 (ఎల్లో అలెర్ట్) క్రమానుగత ప్రతిస్పందన కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తీసుకొస్తున్నాం. అమలు చేసే ఆంక్షల వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల చేస్తాం" అని ప్రభుత్వ అధికారులో ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సీఎం కేజ్రీవాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
"ఢిల్లీలో కరోనా కేసుల పెరిగితే ఎదుర్కొనేందుకు గతంతో పోలిస్తే మేము 10 రెట్లు ఎక్కువ సన్నద్ధతో ఉన్నాం" అని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. అదేసమయంలో రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్ర పెరుగుతున్నప్పటికీ.. ఆక్సిజన్, వెంటిలేటర్ల వినియోగం మాత్రం పెరగలేదని ఆయన గుర్తుచేశారు. ఏది ఏమైనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎల్లో అలెర్ట్‌ను జారీ చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments