Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక ఉద్యోగులకు యడియూరప్ప షాక్: 3నెలలు సెలవులు రద్దు

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (19:58 IST)
కర్ణాటక ఉద్యోగులకు షాక్ ఇచ్చారు నూతన ముఖ్యమంత్రి యడియూరప్ప. మూడు నెలలపాటు ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు పెట్టొద్దంటూ హెచ్చరించారు. మూడు నెలలపాటు శని, ఆదివారాల్లో కూడా ఉద్యోగులు పనిచేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 
 
గత సంకీర్ణ ప్రభుత్వంలో పాలన సజావుగా సాగలేదని, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనను గాడిన పెట్టేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.  
 
అధికారులు పాలనపై పూర్తిగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. మరో మూడు నెలల వరకూ ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. శనివారం అన్ని డివిజన్ల కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సీఎం యడియూరప్ప సమావేశం నిర్వహించారు.

కరువు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు, పాలనను గాడిలో పెట్టేందుకు శని, ఆదివారాలు కూడా పనిచేయాలని ఆదేశించారు. మూడు నెలలు వరకు నో హాలిడేస్ అని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించి, ఎలాంటి ఆలస్యమూ లేకుండా వారికి వెంటనే పరిహారాన్ని చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
 
రైతులు పశుగ్రాసాన్ని టన్నుకు 4,000 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని, పశుగ్రాసం పెంచేందుకు అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇక, ఆల్మటి, నారాయణపూర్ డ్యాముతో పాటు మరో 10 బేరజ్‌లలో నీటి మట్టాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని యడియూరప్ప అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments