ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తయిన వంతెన నిర్మాణం

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (15:32 IST)
జమ్మూకాశ్మీర్‌‌‌ రాష్ట్రంలోని‌ ఉద్ధంపూర్‌‌‌‌లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. దీని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాతావరణం సరిగా లేకపోయినా లెక్క చేయకుండా ఇంజినీర్లు, వర్కర్లు పనులు కొనసాగిస్తున్నారు. ఈ వంతెనను వచ్చే 2021 నాటికి పూర్తిచేయాలని ఇంజనీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని కొంకణ్‌‌ రైల్వేస్‌‌ ఛైర్మన్‌‌, మేనేజింగ్‌‌ డైరెక్టర్ సంజయ్ గుప్తా వెల్లడించారు. 
 
ఇప్పటికే బ్రిడ్జ్‌‌ ఆర్చ్‌‌ చాలా వరకు పూర్తయిందని, దాని ఎత్తు ఈఫిల్‌‌ టవర్‌‌‌‌ కంటే 35 మీటర్లు ఎత్తు ఉంటుందని అన్నారు. 'బ్రిడ్జిని, టన్నెళ్లను నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ వాటిని అధిగమిస్తూ ఇంజినీర్లు, వర్కర్లు పనిచేస్తున్నారు. నిర్మాణం పూర్తైతే అది ఇంజినీరింగ్‌‌ మిరాకిల్‌‌. ఖచ్చితంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం' అని కొంకణ్‌‌ రైల్వేస్‌‌ కోఆర్డినేషన్‌‌ చీఫ్‌‌ ఇంజినీర్‌‌‌‌ ఆర్‌‌‌‌కే. హెగ్దే ధీమా వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌ను దేశంలో ఇతర ప్రాంతాలతో కలిపేందుకు 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ ప్రపంచంలోనే ఎత్తైన ఈ వంతెన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments