Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశ్మీర్ లోయలోకి వచ్చిన 273 మంది టెర్రిరిస్టులు.. హై అలెర్ట్

Advertiesment
కాశ్మీర్ లోయలోకి వచ్చిన 273 మంది టెర్రిరిస్టులు.. హై అలెర్ట్
, శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (09:04 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్... భారత్‌లో విధ్వంసానికి ఉగ్రమూకలను ప్రేరేపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 273 మంది కాశ్మీర్ లోయలోకి చొరబడినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కాశ్మీర్ లోయతో పాటు.. జమ్మూ, లద్ధాక్ తదితర ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆగస్టు 7వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం బలగాల పహారాలో ఉంది. అక్కడ పరిస్థితులు ఇపుడిపుడే చక్కబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జమ్మూకాశ్మీర్లో 273 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. 
 
దాడులకు పాల్పడటం ద్వారా, అలజడులు సృష్టించేందుకు ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు యత్నిస్తున్నారని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కాశ్మీరులో 96, దక్షిణ కాశ్మీరులో 158, సెంట్రల్ కాశ్మీరులో 19 మంది ముష్కరులు ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ నేపథ్యంలో, భారత భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం వేటను ప్రారంభించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకులకు 5 రోజులు సెలవులు