Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న మహిళలు

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (14:47 IST)
అత్యాచార చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భాగస్వాములతో భేదాభిప్రాయాలు తలెత్తిన సమయంలో ఈ చట్టాన్ని వారు ఓ ఆయుధంగా వాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై అతడి మాజీ ప్రేయసి దాఖలు చేసిన అత్యాచారం కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి శరద్ కుమార్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ వ్యక్తిపై మహిళ అత్యాచారం కేసు వేశారు. 2005 నుంచి వారు రిలేషన్‍లో ఉన్నారు. ఇద్దరిలో ఎవరికి జాబ్ వచ్చినా పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలో వారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత అతడు మరో మహిళను వివాహం చేసుకోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. 
 
అయితే, అతడికి పెళ్లయ్యాక కూడా వారిద్దరూ తమ బంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో జూన్ 30న ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే, మహిళ దాఖలు చేసిన అత్యాచార కేసును కోర్టు కొట్టేసింది. 'అతడికి పెళ్లయిన తర్వాత కూడా పిటిషనర్ తమ బంధాన్ని కొనసాగించారు. అంటే.. ఆమె అతడితో బంధానికి అంగీకరించినట్టే' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
అతడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అనేది తమ బంధం తొలినాళ్లలోనే నిగ్గుతేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. పరస్పర అంగీకారంతో శారీరకంగా దగ్గరయ్యాక పెళ్లికి నిరాకరిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments