Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగ్జరీ హోటల్‌లో బస చేసిన మహిళ.. బిల్లు రూ.6 లక్షలు... బ్యాంకు ఖాతాలో రూ.14 మాత్రమే...

వరుణ్
బుధవారం, 31 జనవరి 2024 (11:01 IST)
ఓ మహిళ ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో ఏకంగా 15 రోజుల పాటు బస చేసింది. దీనికి హోటల్ యాజమాన్యం ఆరు లక్షల రూపాయల బిల్లు వేశారు. ఈ బిల్లు చెల్లించడంలో ఆమె విఫలమైంది. దీంతో ఆమె బ్యాంకు ఖాతాను చెక్ చేయగా కేవలం రూ.14 మాత్రమే ఉంది. దీంతో హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళను అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఎయిర్‌పోర్టును సమీపంలోని 'పుల్మన్ హోటల్'లో ఆమె బస చేసిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితురాలు హోటల్‌ను మోసం చేసిందని, ఆమె ఖాతాలో కేవలం రూ.41 మాత్రమే ఉన్నాయని పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే నిందిత మహిళ హోటల్లో బస చేయడానికి గల కారణాలు ఏమిటో తెలియరాలేదన్నారు. నిందిత మహిళకు సంబంధించిన అడ్రస్, వివరాలు తెలియజేయాలంటూ ఏపీ పోలీసులను సంప్రదించామని, ఈ మేరకు లేఖ రాశామని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
 
నిందిత మహిళ విచారణకు సహకరించడం లేదని, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూపించేందుకు నిరాకరించిందని, ఆమె బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా, కేవలం రూ.41 ఉన్నాయని గర్తించామని తెలిపారు. నిందిత మహిళ పేరు ఝాన్సీ రాణి శామ్యూల్ అని, 15 రోజుల పాటు 'పుల మన్ హోటల్'లో ఆమె బస చేసిందని తెలిపారు. దాదాపు రూ.5,88,176 విలువైన అనుమానిత లావాదేవీలు జరిపిందని తెలిపారు. హోటల్ సిబ్బందికి నకిలీ గుర్తింపు కార్డును అందజేసిందని పోలీసులు వివరించారు.
 
నిందిత మహిళ హోటల్లో రూ.2,11,708 విలువైన సర్వీసులు పొందిందని హోటల్ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ యూపీఐ యాప్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్టు ఝాన్సీ వివరాలను చూపించిందని, అయితే అవి హోటల్ అకౌంట్లోకి రాలేదని చెప్పారు. ఎలాంటి చెల్లింపులు జరగలేదని గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితురాలు ఝాన్సీ డూప్లికేట్ యాప్ ఉపయోగించిందని తెలిపారు. 
 
పైగా, తాను ఒక డాక్టర్ అని, తన భర్త కూడా వైద్యుడే అని చెబుతోందని పోలీసులు చెప్పారు. తన భర్త న్యూయార్క్ నగరంలో ఉంటున్నారని చెప్పిందని, అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని వివరించారు. హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఝాన్సీని జనవరి 13న అరెస్టు చేశామని చెప్పారు. ఐపీపీ సెక్షన్లు 419 (మోసం), 468 (ఫోర్జరీ), 471 (నకిలీ పత్రాల్ని ఉపయోగించడం) కింద కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments