Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లెట్ బండికి దారి ఇవ్వలేదని ఆటో వాలాను హాకీ కర్రతో చితకబాదిన ఓ యువతి..

వరుణ్
శుక్రవారం, 5 జులై 2024 (10:54 IST)
ఢిల్లీలో ఓ యువతి రెచ్చిపోయింది. ఉన్మాదిలా ప్రవర్తించింది. ఓ ఆటోవాలాను బహిరంగ ప్రదేశంలో చితకబాదేసింది. హాకీ కర్రతో రక్తమోడేలా చావబాదింది. ఈ భయానక ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లకు ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. ఢిల్లీలోని నిహాల్ విహార ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
 
వైరల్ వీడియోలోని క్యాప్షన్ ప్రకారం, స్కూలు పిల్లలను తీసుకుని వెళుతున్న ఓ ఆటోవాలా ట్రాఫిక్ జాం కావడంతో ఆగిపోయాడు. అతడి వెనకే బుల్లెట్ బండిపై వస్తున్న యువతి తప్పుకోమని ఆటోవాలకు సూచిస్తూ పలుమార్లు హారన్ మోగించింది. అయితే, ఆటోవాలా తప్పుకోకపోవడంతో యువతి ఒక్కసారిగా సైకోలా మారి ఆటోవాలాను తన హాకీ కర్రతో ఇష్టారీతిన కొట్టింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయం కావడంతో రక్తం ధారాపాతంగా కారింది.
 
ఆటోవాలాను కాపాడేందుకు స్థానికులు రంగంలోకి దిగారు. యువతిని అడ్డుకున్నారు. ఈ వీడియో నెట్టింట కూడా సంచలనంగా మారింది. యువతి ఉన్మాదాన్ని చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కాలంలో కూడా ఇలా గుండాగిరి చేసేవారిని అస్సలు ఉపేక్షించకూడదని అన్నారు. వీడియోను రీట్వీట్ చేస్తూ ఢిల్లీ పోలీసులను కూడా ట్యాగ్ చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments