Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం : మంత్రి పొన్నం

Advertiesment
ponnamprabhakar
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (17:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఇందులోభాగంగా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ఈ పథకం అమలు వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నట్టు వాపోతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆటో డ్రైవర్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమం చాలా బాగా జరుగుతుందన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో 5126 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. వీటిలో చాలా మంది సొంతింటి కోసం వినతి పత్రం సమర్పించారని, ఆ తర్వాత నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో వచ్చారని తెలిపారు. వాళ్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు. 
 
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ఈ అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో వాళ్లు మా సోదరులేనని, వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు కాస్త ఓపిక పట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. 
 
ఐపీఎల్ 2024 వేలం పాటలు : రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయిన ఆటగాడు..  
 
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు మంగళవారం దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ ఆల్‌టైమ్ రికార్డు ధరకు అమ్ముడు పోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రికెటర్ ఏకంగా రూ.20.5 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది.
 
అలాగే, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ను రూ.14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్‌ సొంతం చేసుకుంది. భారత పేసర్‌ హర్షల్‌ పటేల్‌ను రూ.11.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో సెంచరీ సాధించి ఆసీస్‌ను గెలిపించిన ట్రావిస్ హెడ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ రూ.6.8 కోట్లకు కొనుగోలు చేసింది.
 
ఆల్‌రౌండర్ వనిందు హసరంగను కూడా రూ.1.5 కోట్లకు తీసుకుంది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ను రూ.4.2 కోట్లు పెట్టి పంజాబ్‌ దక్కించుకుంది. శార్దూల్‌ను (రూ.4 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.1.50 కోట్లు) చెన్నై సూపర్‌ కింగ్స్‌ వేలంలో సొంతం చేసుకుంది. 
 
కాగా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక ధర రికార్డు ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ శామ్ కరణ్ పేరిట ఉంది. 2023 సీజన్ కోసం శామ్ కరణ్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.18.5 కోట్లకు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇపుడు ఆ రికార్డును ప్యాట్ కమిన్స్ బద్ధలు కొట్టాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ONDC ఇంకా Meta డిజిటల్ కామర్స్ సామర్థ్యాలు తెలిసేలా చిన్న వ్యాపారాలకు మద్దతునిచ్చే భాగస్వామ్యానికి శ్రీకారం