Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివస్త్రను చేసి.. రోడ్డుపై పరుగులు పెట్టించాడు.. వీడియోలు తీసిన పోలీసులు

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (11:38 IST)
ఉత్తరప్రదేశ్‌ దారుణాలకు అడ్డాగా మారిపోయింది. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఈవ్-టీజింగ్ చేసిన యువకుడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో సదరు మహిళ ఘోర అవమానానికి గురైంది.


సదరు మహిళ ఇంటికెళ్లిన యువకుడు సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడు. ఆమె ఇంటికి వెళ్లి.. ఆమెను ఇంటి నుంచి లాక్కొచ్చి.. వివస్త్రను చేసి నడి బజార్లో పరుగులు పెట్టించాడు. ఈ ఘటన యూపీలోని భడోహి జిల్లా గోపీగంజ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం పూట ఓ మహిళను బజారు వద్ద ఓ యువకుడు అడ్డగించి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అతడిని ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె అతడిని హెచ్చరించింది. దీంతో అక్కడ నుంచి అవమానభారంతో వెనుదిరిగిన యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆపై స్నేహితులను వెంటబెట్టుకుని.. ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమెను ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చాడు. ఆమెపై దాడి చేశాడు. 
 
వివస్త్రను చేసి వీధుల్లో పరుగులు పెట్టించాడు. భయంతో రోడ్లపై పరుగులు పెడుతున్న ఆమెను రక్షించాల్సిన స్థానికులు ఫొటోలు, వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం