Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి అయ్యాక కూడా బలాత్కారం... భరించలేక చంపేసిన మహిళ...!

Webdunia
ఆదివారం, 18 అక్టోబరు 2020 (16:20 IST)
చిన్న వయసులో అత్యాచారానికి తెగబడిన ఓ కామాంధుడు పెళ్లి అయిన తర్వాత కూడా వేధించసాగాడు. అతని వేధింపులు భరించలేని ఓ మహిళ చివరకు అతన్ని హతమార్చింది. ఆ తర్వాత నేరుగా ఠాణాకు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలోని గుణ జిల్లా అశోక్ నగర్ నివాసి బ్రిజ్ భూషణ్ శర్మ అనే వ్యక్తి ఓ మహిళపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. నిజానికి ఆ మహిళ వయసు 16 యేళ్లుగా ఉన్నడు తొలిసారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతనికి వివాహమైన తర్వాత కూడా ఆమెను బెదిరిస్తూ బలాత్కారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
తన భర్త  వేరే జిల్లాలో పనిచేయడానికి వెళ్లగా మద్యం మత్తులో ఉన్న శర్మ తన ఇంటికి వచ్చి తనపై అత్యాచార యత్నం చేయబోగా అతన్ని వంటగదిలోని కత్తితో పొడిచి చంపానని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. తాను 16 ఏళ్ల వయసులో ఉండగా 2005వ సంవత్సరంలో తన పొరుగింటి వ్యక్తి అయిన శర్మ తనపై మొదటిసారి అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ గత 15 ఏళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని మహిళ పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని నెన్నెలలో ఓ యువకుడు ఘాతుకానికి పూనుకున్నాడు. వృద్ధురాలిపై మూడు రోజులుగా యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. కామాంధుడి ఘాతుకాన్ని భరించలేని బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. జరిగిన ఘోరంపై పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments