Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లయినా వదలని కామాంధుడు, సరే రమ్మని ఇంటికి పిలిచి పొడిచి చంపేసింది

Advertiesment
పెళ్లయినా వదలని కామాంధుడు, సరే రమ్మని ఇంటికి పిలిచి పొడిచి చంపేసింది
, శనివారం, 17 అక్టోబరు 2020 (16:21 IST)
తెలిసీ తెలియని వయస్సు అది. స్నేహితుడిగా ఉన్న వ్యక్తిని నమ్మింది. అయితే అతను ఆమెను తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. అఘాయిత్యానికి పాల్పడటమే కాదు ఏకంగా ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ఎక్కడైనా చెబితే నెట్లో పెట్టి, నిన్ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి ఆ కీచకుడిని కలవడం వదిలేసింది. పెళ్ళి చేసుకుని పుట్టింటికి వచ్చేసింది. అయినా వదల్లేదు ఆ కీచకుడు. చివరకు ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
 
మధ్యప్రదేశ్ జిల్లా అశోక్ నగర్‌కు చెందిన శర్మ 15 సంవత్సరాలుగా ఒక మహిళను వేధిస్తూ తన కామదాహాన్ని తీర్చుకునేవాడు. సరిగ్గా 16 సంవత్సరాల వయస్సులో తన ఇంటి పక్కనే ఉన్న యువతితో అతనికి స్నేహం ఉండేది. ఆ స్నేహంతో ఆమెను బలాత్కరించాడు. అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.
 
అంతేకాదు అత్యాచార దృశ్యాలను చిత్రీకరించి ఆమెకు చూపించాడు. నెట్లో పెడతానన్నాడు. దీంతో ఆ యువతి తనకు జరిగిన అన్యాయాన్ని ఎక్కడా చెప్పలేదు. కానీ సరిగ్గా సంవత్సరం క్రితం ఆ యువతికి వివాహమైంది. తన సమీప బంధుతోనే వివాహం జరిగింది.
 
అతని ఇల్లు కూడా ఆ మహిళ ఇంటికి పక్కనే. దీంతో ఆ కామంధుడు వివాహమైనా వదిలిపెట్టలేదు. వివాహం తరువాత కూడా భర్త ఉద్యోగానికి వెళ్ళగానే ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇలా కామ వాంఛ తీర్చుకుంటూ ఉన్నాడు. కరోనా సమయంలో భర్త ఇంటి పట్టునే ఉండటంతో శర్మ ఇంటికి రాలేకపోయాడు. 
 
కానీ ఫోన్లో మాత్రం ఆమెకు ఇబ్బందులకు గురిచేసేవాడు. అశ్లీల వీడియోలను పంపిస్తూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. ఇంతలో లాక్ డౌన్ సడలింపులతో భర్త ఉద్యోగం నిమిత్తం వెళ్ళడంతో శర్మ మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. అయితే అతడలా రాగానే తనను వేధిస్తున్న శర్మను కత్తితో పొడిచి పొడిచి చంపేసింది బాధితురాలు. 
 
తన భర్త ఎంతో మంచివాడని.. అతనికి మరో వివాహం చేయండని చెప్పి ఒక లేఖ కూడా రాసి నేరుగా పోలీసులకు లొంగిపోయింది మహిళ. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాకు వీగర్‌ మహిళల జుత్తుతో ఉత్పత్తులు.. చైనాపై అమెరికా ఫైర్