పెళ్లైన కొత్త.. భర్తతో అలా షికారుకెళ్లింది.. అంతే సామూహిక అత్యాచారం

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (15:58 IST)
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో కొత్తగా పెళ్లయిన మహిళ తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి గురవడం సంచలనానికి దారి తీసింది. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికి వందమందిని అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు. 
 
గుర్ తహసీల్‌లోని పిక్నిక్ స్పాట్‌లో సోమవారం నాడు కొత్తగా పెళ్లైన వధువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆ మహిళకు ఇటీవలే పెళ్లయింది. ఆమె భర్త 19-20 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. ఇప్పటికీ కళాశాలలో చదువుకుంటున్నారని రేవా హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ హిమాలి పాఠక్ చెప్పారు. 
 
తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఐదుగురిలో ఒకరి చేతిపై, ఛాతీపై పచ్చబొట్లు ఉన్నాయని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తమ విచారణలో భాగంగా 100 మందికి పైగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. 
 
ఈ కేసుకు సంబంధించి బాధితురాలి పేరును బయటపెట్టలేదని.. ఎఫ్‌ఎస్‌ఎల్ సిబ్బంది (ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, అదే రోజు రాత్రి 7 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం