Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై సామూహిక అత్యాచారం.. అది కూడా ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో?

Webdunia
శనివారం, 23 జులై 2022 (16:28 IST)
New Delhi Railway Station
దేశంలో మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు రైల్వే ఉద్యోగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన బాధితురాలు(30) రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒక్కడైన సతీష్‌.. ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం, ఆమెకు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. ఈ క్రమంలోనే గురువారం సతీష్ ఆమెకు ఫోన్ చేసి తమ కొత్త ఇంటికి, తన కొడుకు పుట్టినరోజు వేడుకకు రావాలని ఆమెను ఆహ్వానించాడు. 
 
దీంతో ఆమె కీర్తి నగర్ మెట్రో స్టేషన్‌లో సతీష్‌ను కలుసుకుంది.  సతీష్‌ అనంతరం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి.. బాధితురాలని రైల్వే స్టేషన్‌లోని 8-9 ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ మెయిన్‌టేనెన్స్ రూమ్‌లో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
 
కాగా, బాధితురాలు మరుసటి రోజు పోలీసులకు ఫోనులో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్టేషన్‌కు చేరుకుని ఆమెను రక్షించినట్టు రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నిందితులు సతీష్ కుమార్, వినోద్ కుమార్, మంగళ్ చంద్, జగదీష్ చంద్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం